NBK – PSPK : అభిమానులు మరియు ప్రేక్షకులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కి సంబంధించిన మెయిన్ ప్రోమో ఈరోజు విడుదలైంది..ఈ ప్రోమో సెన్సషనల్ గా మారింది..పవన్ కళ్యాణ్ జీవితం లో చోటు చేసుకున్న ఎన్నో విషయాల గురించి.,అభిమానులు మరియు జనాలు ఎదురు చూస్తున్న ఎన్నో ప్రశ్నలకు ఈ ఎపిసోడ్ ద్వారా సమాధానం చెప్పబోతున్నాడు పవన్ కళ్యాణ్.
ఇక మధ్యలో పవన్ కళ్యాణ్ అల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా వస్తాడు..సాయి ధరమ్ తేజ్ తో కాసేపు సరదాగా బాలయ్య మరియు తన మామయ్య పవన్ కళ్యాణ్ తో చేసిన సరదా ఈ ఎపిసోడ్ లో హైలైట్ గా మారింది..ముందుగా సాయి ధరమ్ తేజ్ రాగానే బాలయ్య కోరినట్టు పవన్ కళ్యాణ్ మ్యానరిజం చేస్తాడు.
ఆ తర్వాత అమ్మాయిల గురించి సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘అమ్మాయిలు హారర్ చిత్రం లాంటి వాళ్ళు సార్’ అని బాలయ్య బాబు తో చెప్తాడు..అప్పుడు బాలయ్య ‘ఓరినీ అంత మాట అనేసావు ఏంటయ్యా’ అని నోరు మూయిస్తాడు..ఆ తర్వాత కొంత సంభాషణ జరిగిన తర్వాత ‘అమ్మాయిలను ఎలా గౌరవించాలో కూడా బాబాయ్ నేర్పించాడు’ అంటాడు..అప్పుడు పవన్ కళ్యాణ్ ‘ఏంటి’ అంటూ సాయి ధరమ్ తేజ్ ని కుమ్మేసే రేంజ్ లో సీరియస్ గా ఎక్సప్రెషన్ పెడుతాడు..చూసే వాళ్లకి నిజంగానే కొట్టేస్తాడేమో అనే అనుభూతి కలుగుతుంది..అప్పుడు బాలయ్య పవన్ కళ్యాణ్ తో ఇంటికి వెళ్లిన తర్వాత మీ వాడికి బాధిత పూజా కదా అని అంటాడు.. హా కొద్దిగా ఉంటాది కచ్చితంగా అని సమాధానం ఇస్తాడు పవన్ కళ్యాణ్.