Sai Pallavi SVP Movie పాలబుగ్గల హీరో మహేష్ బాబు అంటే ఇష్టపడని వారు ఉండరు. ఆయన మేనరిజం , యాక్టింగ్ కు ఫిదా అవ్వని వారు లేరు. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు కూడా మహేష్ అభిమానుల్లో ఉన్నారు. ఇటీవలే విడుదలైన ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదలై సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా చూసేందుకు సెలబ్రెటీలు ఆసక్తి చూపిస్తున్నారు.
దేశంలో జరుగుతున్న ఆర్థిక నేరాలు, వాటి వల్ల పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా దర్శకుడు పరుశురాం ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని తెరకెక్కించారు. మహేష్ మూవీకి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.
ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ అయినా కూడా సామాన్యురాలిగా బయట జీవింతే సాయిపల్లవి తాజాగా షాక్ ఇచ్చింది. ఈ మూవీ చూసేందుకు ఓ సాధారణ ప్రేక్షకురాలిగా వెళ్లి సినిమా చూసింది. మారు వేషంలో సాయిపల్లవి హైదరాబాద్ లో సర్కారువారి పాట మూవీ చూసింది.
మహేష్ సినిమా చూసేందుకు సాయిపల్లవి ఏకంగా ముసుగు ధరించి థియేటర్ కు వెళ్లింది.హైదరాబాద్ లోని పీవీఆర్ ఆర్కే సినీ ఫ్లెక్స్ లో మహేష్ మూవీ చూసి ఎంజాయ్ చేసింది. ఈ క్రమంలోనే తననెవరూ గుర్తు పట్టకుండా స్కార్ప్ తో తన ముఖాన్ని కప్పుకుంది. సినిమా అయిపోయిన తర్వాత కూడా ముఖానికి మాస్క్ ధరించి ఎవరికీ కనపడకుండా జాగ్రత్త పడుతూ ఫోన్ మాట్లాడుతూ థియేటర్ నుంచి వేగంగా నడుచుకుంటూ వెళ్లింది.
అయితే కొందరు వీడియో తీయడంతో అది వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో కూడా సాయిపల్లవి ఇలానే ఒంటరిగా జనాల్లోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాన్ని కూడా ఆమె మారు వేషంలో ప్రేక్షకులతోపాటు చూసి షాక్ ఇచ్చింది. బుర్కా ధరించి ఈ సినిమా చూసింది.
సాధారణంగా సెలబ్రెటీలు బయటకు వస్తే బాడీ గార్డ్స్ లేకుండా బయటకు రారు. కానీ సాయిపల్లవి మాత్రం ఎలాంటి బాదరబందీ లేకుండా ఇలా స్వేచ్ఛగా మారువేషాల్లో బయట తిరుగుతుంటుంది.
Yesterday @Sai_Pallavi92 mam Watched #SarkaruVaariPaata movie at PVR RK Cineplex (Hyderabad) 😃♥#SaiPallavi pic.twitter.com/e94wnk2OpM
— Sai Pallavi FC™ (@SaipallaviFC) May 15, 2022