Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవిని ఫ్యాన్స్ బాగా మిస్ అవుతున్నారు. గార్గి మూవీ అనంతరం ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనపడలేదు. కొత్త సినిమాలకు సైన్ చేయకపోవడం మరింత ఆందోళనకు గురి చేస్తుంది. ఈ క్రమంలో అనేక పుకార్లు తెరపైకి వచ్చాయి. ఆమె సినిమాలు మానేశారని, డాక్టర్ వృత్తిలో కొనసాగాలనుకుంటున్నారని ప్రచారం అవుతుంది. అలాగే సాయి పల్లవి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పేశారనే ప్రచారం మొదలైంది. కెరీర్ పీక్స్ లో ఉండగా సాయి పల్లవి రెస్ట్ తీసుకోవడం వెనుక ఆంతర్యం అర్థం కావడం లేదు.

ఇటీవల సాయి పల్లవి దీనిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. భాషా భేదాలు లేకుండా మంచి కథ, పాత్ర దక్కితే సినిమా చేస్తాను. గొప్ప పాత్రలతో మిమ్మల్ని అలరించాలి అనేదే నా కోరిక. అభిమానులు నన్ను తమ ఇంటిలో ఒక అమ్మాయిగా భావిస్తున్నారు. కాబట్టి మంచి సినిమాలు ఎప్పటికీ చేస్తూ ఉంటాను, అన్నారు. ఆమె మాటలు పరిశీలిస్తే… ఆమెకు వస్తున్న ఆఫర్స్ నచ్చడం లేదని, కథ నచ్చితేనే సినిమా చేస్తారని తెలుస్తుంది. సాయి పల్లవి కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయకపోవడానికి ప్రధాన కారణం ఇదే అనిపిస్తుంది.
సోషల్ మీడియాలో చాలా అరుదుగా పోస్ట్స్ పెట్టే సాయి పల్లవి ఎట్టకేలకు తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేశారు. తన పెట్ డాగ్ తో పాటు ఆమె చిల్ అవుతున్నారు. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన సాయి పల్లవి… ‘హలో సన్ షైన్’ అంటూ కామెంట్ పెట్టారు. సాయి పల్లవి ఎప్పటిలాగే నేచురల్ బ్యూటీతో ఆకట్టుకున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఎన్నాళ్లకు కనిపించారంటూ పండగ చేసుకుంటున్నారు. సాయి పల్లవి ఫోటోలను ఫ్యాన్స్ లైక్స్, షేర్స్, కామెంట్స్ తో ట్రెండ్ చేస్తున్నారు.
View this post on Instagram
చిన్న చిన్న పాత్రలతో వెండితెరకు పరిచయమైన సాయి పల్లవి… మలయాళ చిత్రం ప్రేమమ్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక తెలుగులో ఆమె మొదటి చిత్రం ఫిదా. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. సాయి పల్లవి తన నటనతో ఫిదా చిత్రాన్ని విజయతీరాలకు చేర్చింది. 2021లో రెండు సూపర్ హిట్ చిత్రాలలో సాయి పల్లవి నటించారు. నాగ చైతన్యకు జంటగా నటించిన లవ్ స్టోరీ, నానితో జతకట్టిన శ్యామ్ సింగరాయ్ మంచి విజయాలు సాధించాయి.