Manchu Manoj Second Marriage: మోహన్ బాబు వారసుల్లో మనోజ్ ఒకరు. దొంగ దొంగది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మనోజ్ కి టైం కలిసి రాలేదు. కొద్దోగొప్పో టాలెంట్ ఉన్నప్పటికీ హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. హీరోగా ఇరవైకి పైగా చిత్రాలు చేశారు. ఒక్కటి కూడా కమర్షియల్ హిట్ కాలేదు. మనోజ్ కి బ్రేక్ ఇవ్వలేదు. మనోజ్ నటించిన చివరి చిత్రం ఒక్కడు మిగిలాడు. అది 2017లో విడుదలైంది. 2018లో రెండు చిత్రాల్లో క్యామియో రోల్స్ చేశారు. ఆయన సిల్వర్ స్క్రీన్ పై కనిపించి ఐదేళ్లు దాటిపోయింది. ప్రేక్షకులు దాదాపు ఆయన్ని మరచిపోయారు.

అహం బ్రహస్మి పేరుతో ఒక పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. మూడేళ్లు అవుతున్నా ఎలాంటి అప్డేట్ లేదు. అటు వ్యక్తిగత జీవితంలో కూడా ఇబ్బందులు తలెత్తాయి. 2019లో భార్య ప్రణతి రెడ్డితో మనోజ్ విడిపోయాడు. విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా గత ఏడాది మనోజ్ రెండో పెళ్లి వార్తలతో వెలుగులోకి వచ్చాడు. ఆయన భూమా అఖిల ప్రియ చెల్లి మౌనికతో కలిసి కనిపించారు. వినాయక చవితి సందర్భంగా… మనోజ్-మౌనిక గణేష్ మండపం వద్దకు వెళ్లి పూజలు చేశారు.
తర్వాత కూడా పలు సందర్భాల్లో కలిసి కనిపించారు. మనోజ్-మౌనిక వివాహం చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పరోక్షంగా హింట్ ఇవ్వడమే కానీ నేరుగా మనోజ్ స్పష్టత ఇచ్చింది లేదు. అయితే తాజా ట్వీట్ తో మనోజ్ మౌనికను వివాహం చేసుకుంటున్నట్లు చెప్పకనే చెప్పాడు. మౌనిక తండ్రి భూమా నాగిరెడ్డి జయంతి పురస్కరించుకొని మనోజ్ ట్వీట్ వేశారు. ”మీరు మంచి తండ్రి, భర్త, కొడుకు… అన్నింటికీ మించి గొప్ప మానవతావాది. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి అంకుల్” అని ట్వీట్ చేసి భూమా నాగిరెడ్డి ఫోటో పోస్ట్ చేశారు.

ఈ క్రమంలో మనోజ్ భూమా ఫ్యామిలీ మెంబర్ గా భావిస్తున్నాడని. మౌనికతో ఆయన పెళ్లి ఖాయమే అంటున్నారు. కాగా మనోజ్ కి పెళ్ళికి ముందే మౌనికతో పరిచయం ఉందట. ఇద్దరూ వివాహం చేసుకోవాలని కూడా అనుకున్నారట. అనుకోని కారణాలతో అది జరగలేదు. మనోజ్ ప్రణతి రెడ్డిని 2015లో వివాహం చేసుకున్నారు. మౌనికకు మరొకరితో వివాహం జరిగింది. మనోజ్ మాదిరి ఆమెకు కూడా విడాకులు అయ్యాయి. శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి పిల్లలే మౌనిక, అఖిల ప్రియ. ఒకప్పుడు వైఎస్సార్సీపీలో ఉన్న ఈ కుటుంబం ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు.
He was just not only a great Leader but also a great son, husband, father and more than above all a great human with a big heart ❤️
Remembering my uncle Bhuma Nagi reddy garu on his birth anniversary 🙏🏻
Keep showering your blessings upon us 🙏🏼❤️ Om Shanti 🙏🏼 pic.twitter.com/YBz7Unt1nl
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 8, 2023