Sai Pallavi: సాయిపల్లవి బోనమెత్తితే ఎట్టుంటాదో తెలుసా?

Sai Pallavi: తెలంగాణలో బోనాల పండుగకు ప్రాశస్త్యం ఉంది. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో బోనాల పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. తెలంగాణ ప్రభుత్వం కూడా బోనాల పండుగను రాష్ర్ట ప్రభుత్వ పండుగగా గుర్తించింది. నగరంలో బోనాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనం ఎత్తుకుని వచ్చి అమ్మవారికి సమర్పించే సన్నివేశం అత్యంత అద్భుతంగా ఉంటుంది. దీంతో బోనాల పండుగకు అంతటి విలువ వచ్చింది. అందుకే బోనాల పండుగను కొన్ని సినిమాల్లో కూడా చూపించారు. […]

Written By: Srinivas, Updated On : July 25, 2022 12:12 pm
Follow us on

Sai Pallavi: తెలంగాణలో బోనాల పండుగకు ప్రాశస్త్యం ఉంది. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో బోనాల పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. తెలంగాణ ప్రభుత్వం కూడా బోనాల పండుగను రాష్ర్ట ప్రభుత్వ పండుగగా గుర్తించింది. నగరంలో బోనాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనం ఎత్తుకుని వచ్చి అమ్మవారికి సమర్పించే సన్నివేశం అత్యంత అద్భుతంగా ఉంటుంది. దీంతో బోనాల పండుగకు అంతటి విలువ వచ్చింది. అందుకే బోనాల పండుగను కొన్ని సినిమాల్లో కూడా చూపించారు. ప్రత్యేకంగా పాటలు కూడా పాడుకుంటూ వచ్చే సన్నివేశం చూస్తే అందరికి ఊపు వస్తుంది.

Sai Pallavi

బోనం ఎత్తుకుని అందరు నృత్యం చేస్తూ డప్పు చప్పుళ్లతో దరువు వేసుకుంటూ వస్తారు. నగరమంతా సందడిగా మారుతుంది. ఇలాంటి వాటిని చూడాలంటే భాగ్యనగరం పోవాల్సిందే. విరాట పర్వం సినిమాలో కూడా బోనాల సన్నివేశాన్ని పెట్టారు దర్శకుడు వేణు ఊడుగుల. ఈ సినిమాలో హీరోయిన్ సాయిపల్లవి తెలంగాణ ఆడపడుచుగా బోనం ఎత్తుకునే సీన్ ఒకటి పెట్టడంతో సినిమాలో హైలైట్ అయింది. ఇప్పుడు బోనాల పండుగను పురస్కరించుకుని దర్శకుడు అదే ఫొటోను షేర్ చేస్తూ తెలంగాణ బోనాల పండుగ శుభాకాంక్షలు అని ట్యాగ్ పెట్టడంతో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Also Read: Body Shaming- Mallemala Programs: మల్లెమాల ప్రోగ్రామ్స్ లో అమ్మాయిలపై ఇంత దారుణంగా బాడీ షేమింగా ! ఈటీవి కూడా పట్టించుకోదా ?

సినిమా చూసిన వారికి అది విరాటపర్వం ఫొటో అని అర్థమవుతుంది. కానీ చూడనివారు మాత్రం సాయిపల్లవి నిజంగానే బోనమెత్తిందా అనే అర్థం వస్తుంది. అందుకే నెటిజన్లు స్పందించి అది విరాట పర్వం ఫొటో అని కామెంట్లు పెట్టడం గమనార్హం. తెలుగు సినిమాల్లో సాయిపల్లవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆమె తీసినవి తక్కువ సినిమాలే అయినా ఎంతో పేరు తెచ్చుకుంది. తన అందం, అభినయం, నాట్యం వెరసి ఆమెలో ఓ మంచి నటి ఉందని రుజువు చేస్తున్నాయి. అందుకే అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే సాయిపల్లవికి అభిమానులు కూడా ఎక్కువే.

Sai Pallavi

ఈ ఫొటోలో సాయిపల్లవి అచ్చ తెలుగు అమ్మాయిలా లంగా ఓణి వేసుకుని ఉండటం తెలిసిందే. దీంతో ఆ ఫొటో ఇప్పుడే దిగిందా అన్నట్లు కనిపించడం మామూలే. దీంతో అందరు కూడా ఫిదా అవుతున్నారు. ఫొటో బాగుండటంతో కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు. తెలంగాణలో బోనం పండుగకు ఎంతటి ప్రాచుర్యం ఉందో తెలిసిందే కదా. అందుకే సాయిపల్లవి ఫొటోకు నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. బోనాల పండుగ సందర్భంగా సాయిపల్లవి ఫొటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు పెడుతున్నారు. మొత్తానికి సినిమాలోని ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారి ఓ సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేయడం విశేషం. సాయిపల్లవి బోనమెత్తితో ఎట్టుంది అనే క్యాప్షన్ కూడా పెడుతున్నారు. దీంతో బోనాల పండుగకు సాయిపల్లవి ఫొటో హైలైట్ గా నిలుస్తోందనడంలో సందేహం లేదు.

Also Read:Shah Rukh Khan: హైదరాబాద్ టోలీ చౌక్ లో నాలుగేళ్లు ఉన్న ఆ స్టార్ హీరో.. కారణమిదే

Tags