
Sai Dharam Tej- NTR: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘వీరూపాక్ష’ ఈ నెల 21 వ తారీఖున పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ ని కూడా బాగా ఆకర్షితులను చేసింది. చాలా కాలం తర్వాత సాయి ధరమ్ తేజ్ నుండి ఒక మంచి సాలిడ్ కంటెంట్ వస్తుందని, ఈ సినిమాతో ఆయన వేరే లెవెల్ కి వెళ్తాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా సాయి ధరమ్ తేజ్ గత చిత్రాలతో పోలిస్తే చాలా బెటర్ గా జరిగింది. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి కార్తీక్ దండు అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్టోరీ మరియు స్క్రీన్ ప్లే అందించాడు.

ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ ని కూడా ప్రారంభించేసాడు సాయి ధరమ్ తేజ్, రీసెంట్ గా ప్రముఖ యాంకర్ బిత్తరి సత్తి తో ఇచ్చిన ఇంటర్వ్యూ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘తారక్ నాకు స్నేహితుడి కంటే ఎక్కువ..నేను ఇండస్ట్రీ కి రాకముందు నుండే ఆయన నాకు చాలా పరిచయం.మా కుటుంబం లో వాళ్ళు కాకుండా, బయట నుండి నాకు బాగా సపోర్ట్ ఇచ్చింది తారక్ మాత్రమే. అరే సాయి ఈ సినిమా చెయ్యి రా, ఆ సినిమా చెయ్యి రా అంటూ నన్ను ప్రోత్సహించేవాడు’ అని చెప్పుకొచ్చాడు.దీనిని బట్టీ అర్థం అవుతుంది ఏమిటంటే మెగా ఫ్యామిలీ లో ప్రతీ ఒక్కరితో జూనియర్ ఎన్టీఆర్ కి మంచి సాన్నిహిత్యం ఉంది..కానీ అభిమానులు మాత్రం సోషల్ మీడియా లో ఎప్పుడూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు.