Sachin Tendulkar Visit Masai Mara: కళ్ళముందు చిరుత పులి ఒక జింకను చంపి తింటూ ఉంటే ఎలా ఉంటుంది? సింహం తన శత్రువును చూసి బిగ్గరగా గాండ్రిస్తే ఎలా అనిపిస్తుంది? ఎత్తున ఉండే ఆస్ట్రిచ్ పక్షి పచ్చిక మైదానాల్లో తీసే పరుగులను దగ్గరగా గమనిస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఆ అనుభూతిని పొందుతున్నారు టీం ఇండియా మాజీ దిగ్గజ బ్యాట్స్మెన్ సచిన్ టెండుల్కర్. క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ఆయన విహారయాత్రల్లో తేలిపోతున్నారు. మొన్ననే కుటుంబంతో కలిసి లండన్ వీధుల్లో తిరిగిన ఆయన.. అంతకుముందు తన కుటుంబంతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. లండన్ ప్రయాణం ముగిసిన తర్వాత ఆయన అటు నుంచి అటే ప్రత్యేక విమానంలో ఆఫ్రికా వెళ్లారు.
సాధారణంగా మనకు ఆఫ్రికా అంటే బీదరికం గుర్తుకొస్తుంది.. కానీ కొన్ని ప్రాంతాల్లో దట్టమైన అడవులు విస్తరించి ఉన్నాయి. మనలాగా వాళ్లు అభివృద్ధి వెంట పడక పోవడం, ఆదిమ తెగలు బలంగా ఉండటంవల్ల అక్కడ అడువులు ఇంకా అంతరించిపోలేదు. వ్యవసాయానికి అనువైన భూమి లేకపోవడంతో చాలామంది ఆఫ్రికన్లు అటవీ ఆధారిత ఉత్పత్తులు విక్రయిస్తూ జీవనం పొందుతూ ఉంటారు. అటవీ ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సఫారీ టూరిస్టులకు వ్యవహరిస్తూ ఉపాధి పొందుతుంటారు. ఆఫ్రికా దట్టమైన అడవులతో కూడి ఉన్నందున ప్రపంచంలోని ఎక్కడా లేని జీవవైవిద్యం అక్కడ కనిపిస్తుంది. పులుల దగ్గర నుంచి అరుదైన పాముల వరకు అక్కడ కనిపిస్తుంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఆ ప్రాంతాలను సందర్శించేందుకు ఇష్టపడుతుంటారు.
తాజాగా దిగ్గజం సచిన్ టెండూల్కర్ విహారయాత్రలో భాగంగా ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అక్కడి దట్టమైన అడవుల్లో సఫారీ వెళ్తున్నారు. ఇక అక్కడి ప్రకృతి రమణీయతను తన కేమెరాల్లో బంధించారు. వై విద్య భరితమైన ప్రకృతిని, అరుదైన జంతువులను తనను అనుసరిస్తున్న వారికి సోషల్ మీడియా ద్వారా పరిచయం చేస్తున్నారు. వేటాడే పులి, గాండ్రించే సింహం, పరుగులు పెట్టే ఆస్ట్రిచ్ పక్షి, ఇలా అనేక రకాల జంతువులను వీడియోలో బంధించి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.. ఆఫ్రికా అడవుల్లో సచిన్ టెండుల్కర్ పర్యావరణాన్ని ఆస్వాదిస్తున్నారు అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. మీరు గనక అక్కడ క్రికెట్ ఆడితే అక్కడ జంతువులు కూడా మిమ్మల్ని అనుసరిస్తాయని మరొక నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో మిలియన్ల కొద్ది వ్యూస్ నమోదు చేసుకుంది.
View this post on Instagram