Homeట్రెండింగ్ న్యూస్Icon Of The Seas: ఈ నౌక టైటానిక్ కంటే ఐదు రెట్లు పెద్దది.. ఇందులో...

Icon Of The Seas: ఈ నౌక టైటానిక్ కంటే ఐదు రెట్లు పెద్దది.. ఇందులో ప్రయాణించాలంటే ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా?

Icon Of The Seas: టైటానిక్ మునిగిపోయి ఇప్పటికీ చాలా సంవత్సరాలు అయిపోయినప్పటికీ దాని గురించి ఎక్కడో ఒక మూల చర్చ జరుగుతూనే ఉంటుంది. మొన్నటికి మొన్న టైటానిక్ షిప్ శకలాలు గుర్తించేందుకు వెళ్లిన కొంతమంది సాహస యాత్రికుల బృందం అట్లాంటిక్ సముద్రంలో మునిగి చనిపోయారు. కొద్దిరోజుల క్రితం వరకు దాని గురించి తీవ్ర చర్చ జరిగింది. దీనికి సంబంధించి ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ స్పందించడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు టైటానిక్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.. అయితే ఈసారి అంతకుమించి అనేలాగా ఒక నౌక సముద్ర అలలతో పోటీపడేందుకు సిద్ధమైంది.

నౌకాయానం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ టైటానిక్ కంటే పెద్ద ఓడ తయారు కాలేదు. అట్లాంటిక్ సముద్రంలో అది మంచు శిఖరాన్ని గుద్దుకొని మునిగిపోయింది. అప్పటినుంచి ఆ స్థాయిలో ఓడ రూపొందలేదు. అయితే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆశ్చర్యంలో మునిగి తేలేలా టైటానిక్ కంటే ఐదంతల రెట్లు పెద్దదైన ఓడను రూపొందించారు. సముద్ర అలలతో పోటీపడేలా, ఆశలు ఉప్పొంగే వారికి అద్భుతమైన అవకాశాన్ని కూడా కల్పించారు. సముద్ర జలాల్లో ఉరకలెత్తేందుకు దీనిలో సకల సదుపాయాలు కల్పించారు. దీనికి “ఐకాన్ ఆఫ్ ది సీస్” అనే పేరు పెట్టారు. ఇప్పటికే దీని ట్రయల్ రన్ పూర్తిచేసుకుంది. రకరకాల ధరల శ్రేణుల్లో ఈ విలాస నౌకకు అద్భుతమైన ప్రయాణానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ఏర్పాట్లు

ఫిన్లాండ్ మెయర్ తుర్క్ షిప్ యార్డ్ ఈ ఓడను నిర్మించింది. రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ నౌక నిర్వహణ బాధ్యత చూసుకుంటుంది. ఈ నౌక పొడువు 1200 అడుగులు. బరువు రెండు లక్షల 50 వేల ఎనిమిది వందల టన్నులు. ఈ నౌకలో 2,350 మంది సిబ్బంది ఉంటారు. 5,610 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 40 ప్రాంతాలకు చెందిన విభిన్న ఆహార ప్రాంతాలు ఇందులో సర్వ్ చేస్తారు. ఈ నౌకలో వాటర్ పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, కుటుంబం మొత్తం చక్కగా ఆస్వాదించే సకల సదుపాయాలు ఇందులో ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరిలో మియామీ నుంచి ఈ నౌక కరేబియన్ సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తుంది. ఈ నౌక లో ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ పార్క్ ఉంది. దీనిని కేటగిరి 6 అని పిలుస్తారు. ఈ వాటర్ పార్కులో ఆరు స్లైడ్ లు ఉన్నాయి. ఒక వాటర్ స్లైడ్ నుంచి నేరుగా సముద్రంలోకి డైవ్ చేసేలా ఏర్పాటు చేశారు. అయితే ప్రయాణికుల భద్రత దృష్ట్యా దీనిని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. జూన్ 22న ఈ నౌక విజయవంతంగా మొదటి ట్రయల్ రన్ పూర్తిచేసుకుంది. ప్రయాణికుల కోసం రకరకాల ఉద్యానవనాలు ఇందులో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సముద్రపు మొక్కలు ఇందులో ప్రధాన ఆకర్షణ. వాటి పక్కన ప్రయాణికులు చక్కగా కూర్చుని సేద తీరవచ్చు. కాలుష్య నివారణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ను ఇందనంగా వాడుకుంటూ ఈ నౌక ప్రయాణం సాగిస్తుంది.

మియామి నుంచి ప్రయాణం

వచ్చే ఏడాది జనవరిలో మీయామి నుంచి ప్రారంభమయ్యే ఈ నౌకలో ప్రయాణం కోసం ఇప్పటికే రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడుపోయాయి. వివిధ రకాల ప్యాకేజీలను నిర్వాహకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయాణికుల ఆర్థిక స్తోమత ఆధారంగా వాటిని ఎంచుకోవచ్చు. నిర్వాహకులు అందిస్తున్న ప్యాకేజీలో అన్నిటికంటే తక్కువగా ఏడు రాత్రులు ఓడలో గడపాలంటే మూడు వేల పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది మన కరెన్సీలో దాదాపు 300,000. కరేబియన్ లోని అత్యంత అందమైన దీవులైన బహమాస్, కొజు మెల్, ఫిలిప్స్ బర్గ్, సెయింట్ మార్టిన్, రోటన్ హోండురస్ వాటి మీదుగా ఈ నౌక ప్రయాణిస్తుంది. వినోదమే ప్రధానంగా పొందిన ఈ షిప్ లో సముద్రపు జనాల మీదుగా ప్రయాణం సాగించాలని పర్యాటకులు ఉత్సాహపడుతున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular