Ruchi Kalra- Asish Mohapatra: మన తలరాతను మార్చేది చేతిలో ఉన్న రేఖలు కాదు మన చేతలే అని చెబుతుంటారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదగాలని కోరుకుంటారు. కలలు అందరు కంటారు. కానీ కొందరే వాటిని సాకారం చేసుకుంటారు. పట్టుదల, దీక్ష, శ్రమతో అనుకున్నది సాధించి జీవితాశయాన్ని నెరవేర్చుకుంటారు. అయితే కొందరికి అదృష్టం కలిసి వస్తుంది. మరికొందరికి దురదృష్టం వెంటాడుతుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని తెలిసినా ఇక్కడ మాత్రం ఇద్దరు భార్యాభర్తలు ఎవరికి వారే తమ విజయయాత్ర కొనసాగిండం విశేషం.
ఒకే కాలేజీ నుంచి ఆశీష్ మహాపాత్ర(41), రుచి కల్రా (38)లు ఇద్దరు కలిసి ఐఐటీలో విద్యనభ్యసించారు. ఒకే కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నారు. కానీ తరువాత ఏర్పడిన పరిచయంతో వారిలో ప్రేమ చిగురించి పెళ్లికి దారి తీసింది. దీంతో ఇద్దరు ఒక్కటయ్యారు. కార్పొరేట్ జాబ్ లు కావడంతో ఎవరికి వారే వారి పనిలో పనితనం చూపించి అబ్బురపరచారు. వ్యాపారాలను ముందుకు నడిపించి యాజమాన్యం దృష్టిలో పడ్డారు. దీంతో దంపతులు అనుకున్నది సాధించారు. బిజినెస్ ను పరుగులు పెట్టించి తామేంటో నిరూపించుకున్నారు.
Also Read: RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ పై ఆ ‘వెబ్ సైట్’ పగ.. ఎందుకంటే ?
మూడు నెలల్లోనే కంపెనీలను అభివృద్ధిలో నిలిపి వారి ఉన్నతిని మిగిల్చుకున్నారు. మెకెన్సీ కంపెనీని వారు ఎక్కడికో తీసుకెళ్లారు. మహాపాత్ర ఢిల్లీ బేస్డ్ గా ఆఫ్ బిజినెస్ పేరుతో రా మెటీరియల్ కొనుగోలుకు సంబంధించిన టెక్ ప్లాట్ ఫామ్ గా పనిచేస్తున్న కంపెనీని గత డిసెంబర్ లో 200 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్ మెంట్ సాధించడంతో కంపెనీ ఒక్కసారిగా అందుకోలేనంత స్థాయికి చేరడం గమనార్హం.
ఆక్సిజో కంపెనీలో రుచికల్రా తన సత్తా చాటింది. కంపెనీలో అల్ఫా వేవ్, టైగర్ గ్లోబల్ , నార్వెస్ట్ వెంచర్స్ పార్టనర్స్ తదితర సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. దీంతో 200 డాలర్ల నిధుల సమీకరణ చేయడంతో కంపెనీ విలువ పెరిగింది. 2022 మార్చి 22న కంపెనీ మార్కెట్ విలువ వన్ బిలియన్ డాలర్లను దాటడంతో ఆక్సిజో కు డిమాండ్ పెరిగింది.
భార్యాభర్తలిద్దరు కలిసి రాణించడం తెలిసిందే. కానీ ఇక్కడ మాత్రం వారు వేరువేరు కంపె నీల్లో పని చేసినా తమ పనితనంతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఒకరి తరువాత ఒకరు తమ నైపుణ్యంతో రాణించి కంపెనీలను తారాస్థాయికి తీసుకురావడమే కాకుండా వారు కూడా పేరు తెచ్చుకోవడం విశేషం.
Also Read: SS Rajamouli Movies: రాజమౌళి తీసిన 12 సినిమాలు ఏవి ? ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది ?