https://oktelugu.com/

Mahesh Babu Tweets On RRR: ‘ఆర్ఆర్ఆర్’ పై మహేష్ స్పందన.. వైరల్ అవుతున్న ట్వీట్స్ !

Mahesh Babu Tweets On RRR: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ స్థాయి ఏంటో బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. ఎన్టీఆర్ – చరణ్ లు సరికొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో తానూ బాక్సాఫీస్ కింగ్ ను అని రాజమౌళి నిరూపించారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున సినిమా పై తమ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 26, 2022 / 04:21 PM IST
    Follow us on

    Mahesh Babu Tweets On RRR: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ స్థాయి ఏంటో బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. ఎన్టీఆర్ – చరణ్ లు సరికొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో తానూ బాక్సాఫీస్ కింగ్ ను అని రాజమౌళి నిరూపించారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున సినిమా పై తమ ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు.

    RRR

    కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను వీక్షించారు. తాజాగా మహేష్ ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేస్తూ ట్వీట్ చేశారు. ఇంతకీ మహేష్ ఏమి ట్వీట్ చేసాడంటే.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఒక E.P.I.C. ‘గ్రాండ్ విజువల్స్ తో అద్భుతంగా ఉంది. అలాగే మ్యూజిక్, ఎమోషన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. కేవలం మాస్టర్ స్టోరీటెల్లర్ మాత్రమే ఇది చేయగలడు. ఒక్క రాజమౌళి మాత్రమే ఇలా సినిమా తీయగలడు.

    Also Read: Allu Arjun Congratulated RRR Team: వైరల్ : ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కి అల్లు అర్జున్ కంగ్రాచ్యులేషన్స్

    సెన్సేషనల్ ఫిల్మ్ మేకింగ్‌లో రాజమౌళి మాస్టర్. తారక్, చరణ్ తమ స్టార్‌ డమ్‌ ను మించి గొప్పగా ఎదుగుతున్నారు. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ లో అసలు గురుత్వాకర్షణ సిద్ధాంతం పనిచేయలేదు ఏమో అనిపించింది. నిజానికి తారక్ – చరణ్ గాల్లో ఎగిరారు. గొప్ప విజయం సాధించిన RRR టీంకు నా అభినందనలు’ అంటూ మహేశ్ బాబు ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించాడు.

    మహేష్ – ఎన్టీఆర్ – చరణ్ ల మధ్య మంచి స్నేహం ఉంది. అయితే, గతంలో ఎన్నడూ ఇలా మహేష్.. ఒక సినిమాని ఇంత అద్భుతంగా పొగడలేదు. కానీ, మొదటసారి మహేష్ బాబు ఇలా ఓపెన్ అయిపోవడం మహేష్ ఫ్యాన్స్ ను కూడా షాక్ కి గురి చేసింది. మహేష్ ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుతూ.. హీరోలతో పాటు అజయ్ సర్, అలియా కూడా హార్ట్ టచింగ్ ఫెర్మామెన్స్ ఇచ్చారని మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

    ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి కీరవాణి అందించిన మ్యూజిక్ కూడా టాప్ లో ఉందని.. దర్శకుడు రాజమౌళితో పాటు మిగతా టీమ్ కూడా అద్భుతంగా పని చేశారు అని.. ముఖ్యంగా సముథ్రకని గారు కూడా అద్భుతంగా నటించారని మహేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మహేష్ కామెంట్స్ పై ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు.

    Also Read: RRR Tickets Are Blocked In Ap: మైండ్ ‘బ్లాక్’…ఆర్ఆర్ఆర్ సినిమాను సొమ్ము చేసుకున్న వైసీపీ నేతలు

    Tags