RRR -Oscor Rajamouli : అమెరికాలోని లాస్‌ఎంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 95వ అకాడమీ అవార్డుల్లో ఆర్‌ఆర్‌ఆర్ సత్తా చాటింది. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కెటగిరీలో పురస్కారం లభించింది. దీంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగి తేలుతోంది. వాస్తవానికి ఈ అవార్డు కోసం గత కొన్ని నెలలుగా చిత్ర బృందం అమెరికాలోనే తిష్ట వేసింది. హాలీవుడ్‌లోని పలువురి ప్రముఖులను కలిసింది. ఈలోగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును సాధించింది. మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని జపాన్‌లోనూ విడుదల చేసింది.
ఇక సోమవారం తెల్లవారుజామున దీపికా పదుకొనే వ్యాఖ్యాతగా ప్రకటించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో నాటు నాటు పాట పేరు ప్రకటించగానే రాజమౌళి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే తన పక్కన ఉన్న భార్యను రమను గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఈ దృశ్యం అక్కడున్నవారందరినీ ఉద్వేగానికి గురి చేసింది. అంతే కాదు ఆస్కార్ పురస్కారం కోసం చిత్ర యూనిట్ ఎంత కష్టపడిందో చెప్పకనే చెప్పింది.
ఈపురస్కారం సాధించిన తర్వాత ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర యూనిట్ ఆఫిషియల్ ట్విటర్ ఎకౌంట్‌లో ఒక ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతుండగా.. రాజమౌళి చూస్తున్నారు. బహుశా ఈ ఫొటో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ట్రైన్ బ్టాస్ట్ సీన్ లేదా ఇంటర్‌వెల్ సీన్ లేదా క్లైమాక్స్ సీన్ కావొచ్చని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే ఈ సన్నివేశాల్లో మంటలు ఉంటాయి. ఆ మంటల వద్ద రాజమౌళి ఉన్నప్పుడే చిత్ర యూనిట్ ఫొటో తీసింది. ఇప్పుడు అవార్డు రావడంతో పోస్ట్ చేసింది. ‘ఇదీ రాజమౌళి సినిమా.. నూతన చరిత్రకు నాంది మొదలయింది’ అని రాసుకొచ్చింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ‘రాజమౌళి ఆస్కార్ మంట మొదలు పెట్టాడు. ఇక దీనిని ఆర్పడం ఎవరివల్లా కాదు అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
AN SS RAJAMOULI FILM…
HISTORY HAS BEEN CREATED… #NaatuNaatu #Oscars #RRRMovie pic.twitter.com/MGyEZmdswR
— RRR Movie (@RRRMovie) March 13, 2023