https://oktelugu.com/

RRR OTT Trailer : మైండో బ్లోయింగ్ విజువల్స్.. ఓన్లీ ఫర్ ఓటీటీ.. ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..

RRR OTT Trailer  రాజమౌళి చెక్కిన శిల్పం లాంటి మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ దేశ, విదేశాల్లో ప్రభంజనం సృష్టించింది. అల్లూరి, కొమురం భీంల నేపథ్యంలో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ను ప్రేక్షకులు చూసి ఫిదా అయ్యారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ను చాలా మంది చూసేశారు. కానీ ఇంకా ఏం చూపించాలని ఆలోచించిన మేకర్స్ మరికొన్ని డిలీట్ చేసిన గ్రాండ్ విజువల్స్ ను యాడ్ చేశారు. వాటితో తీర్చిదిద్దిందే తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీ […]

Written By:
  • NARESH
  • , Updated On : May 13, 2022 / 02:11 PM IST
    Follow us on

    RRR OTT Trailer  రాజమౌళి చెక్కిన శిల్పం లాంటి మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ దేశ, విదేశాల్లో ప్రభంజనం సృష్టించింది. అల్లూరి, కొమురం భీంల నేపథ్యంలో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ను ప్రేక్షకులు చూసి ఫిదా అయ్యారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ను చాలా మంది చూసేశారు. కానీ ఇంకా ఏం చూపించాలని ఆలోచించిన మేకర్స్ మరికొన్ని డిలీట్ చేసిన గ్రాండ్ విజువల్స్ ను యాడ్ చేశారు. వాటితో తీర్చిదిద్దిందే తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీ ట్రైలర్..

    Also Read: KA Paul Meets Amit Shah: అమిత్ షాతో కేఏ పాల్ భేటీ ఆంతర్యమేమిటో?

    ఆర్ఆర్ఆర్ విడుదలై ఊపు తగ్గింది. దీని తర్వాత కేజీఎఫ్2 సహా సర్కారువారి పాట.. ఆచార్య రిలీజ్ కావడంతో ఆ సినిమా కలెక్షన్లు పూర్తిగా పడిపోయాయి. దీంతో ఓటీటీ రిలీజ్ కు మేకర్స్ ప్లాన్ చేశారు. తాజాగా జీ5లో ఆర్ఆర్ఆర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. మే 20 నుంచి అందులో ప్రసారం కానుంది.

    ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ ఓటీటీ కోసం డిలీజ్ చేసిన సీన్లన్నింటిని దట్టించి సరికొత్తగా సినిమాను మలిచారు. ఈ మేరకు కట్ చేసిన ట్రైలర్ ఇప్పుడు గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది. నిజంగా అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారు.

    ఆర్ఆర్ఆర్ ను థియేటర్లో చూసిన జనాలు కూడా తాజాగా కట్ చేసిన ట్రైలర్ ను చూసి అబ్బురపడుతున్నారు. అరే ఈ సీన్ మేం చూడలేదే అని ఆశ్చర్యపోతున్నారు. స్లో మోషన్ లో కొత్తగా.. మరిన్ని సీన్లతో దీన్ని తీర్చిదిద్దారు.

    కాగా థియేటర్లలో ఆర్ఆర్ఆర్ సందడి ముగియడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీన్ని జీ5 ఓటీటీలో ప్రసారం చేస్తున్నారు. మే 20 నుంచి దీన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇక ఓటీటీ ప్రేక్షకులు కూడా దీన్ని చూసి ఎంజాయ్ చేయండి.

    Also Read: Chandamama Movie: ‘చందమామ’ సినిమాలో నుంచి ఆ స్టార్ హీరోని తీసేశారు ?

    Recommended Videos