
RRR – Oscar : కోట్లాది మంది అభిమానులు #RRR సినిమాకి ఆస్కార్ అవార్డ్స్ రావాలని ఎంతగానో ప్రార్థిస్తున్నారు.ఈ నెల 12 వ తారీఖున లాస్ ఏంజిల్స్ లో జరగబోతున్న ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.ఒక హాలీవుడ్ ప్రతిష్టాత్మక అవార్డ్స్ కోసం మన ఇండియన్ ప్రేక్షకులు ఇంతలా ఎదురు చూడడం ఇదే మొదటిసారి.అందుకు కారణం #RRR అయ్యినందుకు ప్రతీ తెలుగోడు ఎంతో గర్విస్తున్నారు.
అయితే ఈ ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ లో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లైవ్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఉంటుందని మొదటి నుండి సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగింది.ఇందుకోసం ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అద్వర్యం లో ఒక వారం రోజుల పాటు రిహార్సల్స్ కూడా చేయబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని #RRR మూవీ టీం మీడియా కి క్లారిటీ ఇచ్చింది.

రామ్ చరణ్ – ఎన్టీఆర్ లైవ్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ అయితే ఉండదు కానీ, ఆ పాటకి కొంతమంది ప్రొఫెషనల్ డ్యాన్సర్లు లైవ్ ప్రదర్శన ఇస్తారని తెలుస్తుంది.దీనితో రామ్ చరణ్ – ఎన్టీఆర్ ఆస్కార్ వేదిక పై లైవ్ డ్యాన్స్ చేస్తే చూడొచ్చని ఆశపడిన అభిమానులకు నిరాశే మిగిలింది.అయితే ఆస్కార్ ప్రొమోషన్స్ కోసం గత వారం రోజుల నుండి #RRR మూవీ టీం అమెరికాలోనే ఉంటుంది.రామ్ చరణ్ తో పలు హాలీవుడ్ టాప్ మీడియా చానెల్స్ వరుసగా ఇంటర్వ్యూస్ కూడా ఇస్తుంది.
అయితే ఈ ప్రొమోషన్స్ కి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేకపోయాడు, కారణం ఆయన సోదరుడు నందమూరి తారకరత్న చనిపోవడమే.మరి 12 వ తేదీన జరగబొయ్యే ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కి అయినా ఎన్టీఆర్ వస్తున్నాడా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న.జీవితం లో అరుదుగా వచ్చే ఇలాంటి అద్భుతమైన అవకాశాలను మిస్ అవ్వకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.మరి ఎన్టీఆర్ మనసులో ప్రస్తుతం ఏమి నడుస్తుందో!.