https://oktelugu.com/

NTR Fights Tiger: ఆర్ఆర్ఆర్: పులితో ఎన్టీఆర్ పోరాటం.. ఎలా తీశారో మేకింగ్ వీడియో వైరల్

NTR Fights Tiger: ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ పరిచయ సన్నివేశం అందరికీ గూస్ బాంబ్స్ తెప్పిస్తుంది. ఓ తోడేలు కోసం కాపు కాసి పట్టుకునేందుకు ఎన్టీఆర్ ప్రయత్నించే సీన్ లోకి సడెన్ గా పెద్దపులి ఎంట్రీ ఇచ్చి ఆగమాగం చేసే సీన్ హైలెట్ గా చెప్పొచ్చు. పులిని కంట్రోల్ చేయడానికి ఎన్టీఆర్ చేసే పోరాట సీన్ నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఉంటుంది. థియోటర్ లో పులితో ఎన్టీఆర్ ఫైట్ సీన్ చూసిన ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుకున్నాయంటే […]

Written By:
  • NARESH
  • , Updated On : August 27, 2022 / 02:03 PM IST
    Follow us on

    NTR Fights Tiger: ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ పరిచయ సన్నివేశం అందరికీ గూస్ బాంబ్స్ తెప్పిస్తుంది. ఓ తోడేలు కోసం కాపు కాసి పట్టుకునేందుకు ఎన్టీఆర్ ప్రయత్నించే సీన్ లోకి సడెన్ గా పెద్దపులి ఎంట్రీ ఇచ్చి ఆగమాగం చేసే సీన్ హైలెట్ గా చెప్పొచ్చు. పులిని కంట్రోల్ చేయడానికి ఎన్టీఆర్ చేసే పోరాట సీన్ నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఉంటుంది.

    NTR Fights Tiger

    థియోటర్ లో పులితో ఎన్టీఆర్ ఫైట్ సీన్ చూసిన ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుకున్నాయంటే అతిశయోక్తి కాదేమో.. అయితే అంతటి క్లిష్ట సీన్ ను ఎలా చిత్రీకరించారన్నది ఇప్పటికీ అంతుబట్టదు. తాజాగా ఎన్టీఆర్ పులి సీన్ మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. దాని కోసం రాజమౌళి స్వయంగా తన శరీరానికి తాడులు కట్టుకొని మరీ సీన్ ఎలా రావాలో వీఎఫ్ఎక్స్ నిపుణులకు చూపించారు. పులి ఎలా ముందుకు దుముకుతుంది? పంజా ఎలా విసురుతుంది? ఎన్టీఆర్ ఎలా తప్పించుకుంటాడన్నది రాజమౌళి తనే నటించి చూపించాడు.

    ఇలా ఆ సీన్ ను అంత పకడ్బందీగా వీఎఎఫ్ఎక్స్ రూపంలో తీసినట్టుగా అర్థమవుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రం దాదాపు 300 కోట్లతో తెరకెక్కించగా.. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

    NTR Fights Tiger

    ఆర్ఆర్ఆర్ లోని చాలా సీన్లు మొత్తం వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ లోనే తీర్చిదిద్దారు. ఇందుకోసం చాలా శ్రమపడినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ లో అన్ని జంతువులతో తీసిన సీన్ దీనికంటే హైలెట్ అని చెప్పొచ్చు. ఇలాంటి గూస్ బాంబ్స్ తెప్పించే సీన్లు చాలా ఈ సినిమాలో ఉన్నాయి. మీరూ ఆ సీన్ మేకింగ్ వీడియోను చూసి ఎంజాయ్ చేయవచ్చు.

     

     

     

    Tags