https://oktelugu.com/

RRR: ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ ఫైట్ అదిరిపోయేలా ఇలా తీశారు!

RRR: ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ హైలెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ తన క్రూర జంతువులతో కలిసి బ్రిటీష్ కోటను బద్దలు కొట్టడం.. మల్లిని తీసుకురావడానికి వీరోచితంగా పోరాడడం.. మధ్యలో రాంచరణ్ వచ్చి ఎన్టీఆర్ ను పట్టుకోవడం.. ఈ 15 నిమిషాలు గూస్ బాంబ్స్ తెప్పిస్తుంది. ఈ భారీ ఇంటర్వెన్ ను తీయడానికి చాలా రోజులు వెచ్చించారు. అయితే ఈ సీన్ చేయడానికి గ్రాఫిక్స్ ను బాగా వాడారు. ఈ మేరకు తాజాగా వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 18, 2022 / 11:40 AM IST
    Follow us on

    RRR: ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ హైలెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ తన క్రూర జంతువులతో కలిసి బ్రిటీష్ కోటను బద్దలు కొట్టడం.. మల్లిని తీసుకురావడానికి వీరోచితంగా పోరాడడం.. మధ్యలో రాంచరణ్ వచ్చి ఎన్టీఆర్ ను పట్టుకోవడం.. ఈ 15 నిమిషాలు గూస్ బాంబ్స్ తెప్పిస్తుంది. ఈ భారీ ఇంటర్వెన్ ను తీయడానికి చాలా రోజులు వెచ్చించారు.

    అయితే ఈ సీన్ చేయడానికి గ్రాఫిక్స్ ను బాగా వాడారు. ఈ మేరకు తాజాగా వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వీడియో బయటకు వచ్చింది.అదిప్పుడు వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్ ఇప్పటికే థియేటర్లు, ఓటీటీల్లో రన్ ముగియడంతో ఈ సినిమాను ఎలా తీశారు? ఎలా గ్రాఫిక్స్ చేశారన్నది వీడియోలను బయటపెడుతోంది ఆ చిత్రం యూనిట్. కొన్ని సర్ ప్రైజ్ వీడియోలను చిత్ర బృందం షేర్ చేస్తోంది.

    ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ ను ఎలా క్రియేట్ చేశారని గ్రాఫిక్స్ లో బాగా క్రియేట్ చేశారు. తాజాగా ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ మకుట ‘ఆర్ఆర్ఆర్’ ఇంటర్వెల్ ఫైట్ సీన్ కు వీఎఫ్ఎక్స్ ఎలా చేశారో వెల్లడిస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సినీ ప్రియులను ఆకర్షిస్తోంది.

    ఎన్టీఆర్ వెంట వచ్చిన జంతువులను గ్రాఫిక్స్ లో డిజైన్ చేశారు. వీరి చేతుల్లోని ఆయుధాలు, నీరు, నిప్పును, బంగ్లాను క్రియేట్ చేశారు. ఇది ఎలా షూట్ చేశారన్నది అద్భుతంగా ఆవిష్కృతమైంది.

    సుమారు 450 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తోంది.