China Military: చైనా అధ్యక్షుడు మరో వివాదాస్పద నిర్ణయంతో ప్రపంచ దేశాలను ఆందోళనలో పడేశాడు. తన ఉనికికి సమస్య వస్తుందని భావించిన ఆయన దేశ భద్రతతో సంబంధం లేకుండా చైనా సైన్యాన్ని తన అధీనంలో ఉంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. దీని కోసం సైన్యానికి కొన్ని అధికారాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పొరుగున ఉన్న భారత్, పాక్‌తోపాటు చైనా ప్రాజెక్టులు చేపడుతున్న దేశాలు, అగ్రరాజ్యం అమెరికాలో కూడా చైనా అధ్యక్షుడి నిర్ణయాలతో ఆందోళన నెలకొంది.
ఇటీవలే కరోనా కేసుల విషయంలో అంతర్గత ఆందోళన..
కరోనాకు పుట్టినిల్లు చైనాలో నెల క్రితం వరకు కరోనా విజంభించింది. దీని కట్టడికి దేశ అధినేత జిన్‌పింగ్ కఠిన ఆంక్షలు అమలు చేశాడు. పైశాచికంగా వ్యవహరించాడు. 11 ప్రధాన నగరాలల్లో లాక్‌డౌన్ విధించాడు. జీరో కేసులు చూపేందుకు భారీగా టెస్టులు పెంచాడు. అయితే ఈ విషయంలో చైనాలో అంతర్గత ఆందోళన మొదలైంది. బలవంతపు పరీక్షలు, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అధ్యక్షుడికి అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బలవంతపు చర్యలతో దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు ఏర్పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. అంతర్జాతీయంగా కూడా విమర్శలు వచ్చాయి.
Also Read: Excise Department Transfers: ఇవేం బదిలీలు?.. ఎక్సైజ్ శాఖలో సొమ్ము చేసుకుంటున్న అధికారులు
తన ఉనికి కాపాడుకునేందుకు..
అంతర్గత ఆందోళన, అంతర్జాతీయ ఒత్తిడుల నేపథ్యంలో అప్రమత్తమైన పింగ్ తన ఉనికికి ఏదో ప్రమాదం వస్తుదని గ్రహించాడు. ఈ క్రమంలో చైనాను తన గుప్పిట్లో పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. సైన్యం అండ ఉంటే ఏ ఉపద్రవాన్నైనా ఎదుర్కొవచ్చని భావించాడు. ఈ క్రమంలో చైనా అనుకూల నిర్ణయాలు తీసుకున్నాడు. యద్ధం విషయంలో సైన్యానికి అధికారాలు ఇస్తూ 56 కొత్త ఉత్తర్వులు జారీ చేశాడు.
పొరుగు దేశాలతోపాటు, సన్నిహితుల్లోనూ ఆందోళన..
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడు పొరుగున ఉన్న భారత్, చైనా, కొరియా, థైవాన్, థాయ్‌ల్యాండ్, సింగపూర్, బూటాన్ తదితర దేశాలతోపాటు చైనా పెట్టుబడడులు పెట్టి అభివద్ధి పనులు చేస్తున్న మిత్ర దేశాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. కారణం సైనిక చర్యపై నిర్ణయా«ధికారం కిందిస్థాయి సైన్యాధికారులకు అప్పగించడమే. ఇకపై అధ్యక్షుడి నిర్ణయంతో సంబంధం లేకుండా చైనా సైన్యం ఎవరిపై అయినా సైనిక చర్య చేపట్టవచ్చు. సైనిక చర్య అంటే పరోక్షంగా యుద్ధ«మే. ఏ దేశంలో అయినా సైన్యాన్ని మోహరించవచ్చు. దేశ భద్రత విషయంలో ఏ నిర్ణయమైనా సైన్యం తీసుకోవచ్చు. ఈ ఆదేశాలతో చైనా సైన్యం మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. ముఖ్యమంగా మన దేశ సరిహద్దుల్లో తరచూ కవ్వింపులకు పాల్పడుతున్న చైనా సైన్యం ఈ ఆదేశాలతో మరింత చెచ్చిపోయే అవకాశం ఉంది. పాకిస్తాన్‌లో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుని మన దేశాన్ని మరింత భయపెట్టే చర్యలకు దిగే అవకాశం ఉంది. పాకిస్తాన్‌పై చర్యలకూ వెనుకాడకోవచ్చు.
Also Read:Agneepath Scheme: అగ్నిపథ్’ అల్లర్లకు చెక్ చెప్పేదెలా? ఇలా చేయాలంటున్న నిపుణులు