RRR Janani Song: రాజమౌళి.. ఒక మొక్కకు అంటుకట్టినట్టు.. ఒక గోడ కట్టినట్టు ఎంత పద్ధతిగా చిత్రాన్ని మలుస్తాడన్నది ఆయన సినిమాలు చూస్తే అర్థమవుతోంది. బాహుబలిని ఒక కళాఖండంగా మలిచి ప్రపంచాన్ని అబ్బురపరిచిన సినీ మాంత్రికుడాయన.. ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’తో ఇప్పుడు అంతకుమించిన విజువల్ వండర్ ను మనకు పరిచయం చేయబోతున్నాడు.
తెలుగు నేల చరిత్రలో పోరుసలిపి సమిధలు అయిన ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల వీరగాథను ప్రపంచానికి చాటి చెప్పే మహాత్కార్యాన్ని రాజమౌళి తలకెత్తుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమురంభీంగా ఎన్టీఆర్ ను చూపించబోతున్నారు. ఇప్పటిదాకా విడుదల చేసిన టీజర్లు, సాంగ్ లు ఒక ఎత్తు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నుంచి విడుదలైన ‘జనని’ సాంగ్ మరో ఎత్తుగా నిలిచింది.
అందుకే ఈ పాటకు ‘ఆర్ఆర్ఆర్ సోల్ అంథెమ్’ ఆర్ఆర్ఆర్ సినిమాకే ఊపిరిపోసిన పాట అని నామకరణం చేశారు. ఇది భావోద్వేగంతో ఊపేసింది. దేశ భక్తిని ఉప్పొంగించింది.బ్రిటీష్ వారితో పోరాడి చనిపోయిన వీరుల నెత్తురును కళ్లకు కట్టింది. దేశం కోసం ప్రాణం త్యాగం చేస్తున్న సమరయోధుల వీరత్వాన్ని కళ్లకు కట్టింది.
అజయ్ దేవ్ గణ్ నుంచి రాంచరణ్, ఎన్టీఆర్, శ్రియా, అలియాభట్.. ఇద్దరు చిన్నారుల దాకా నటనలో పీక్స్ చూపించారు. రాజమౌళి ప్రతీ ఫ్రేమ్ ను చెక్కిన తీరు హైలైట్ అని చెప్పొచ్చు.
ముఖ్యంగా రెండు సీన్లు రాజమౌళి ప్రతిభకు నిదర్శనంగా మారాయి. అందులో ప్రధానమైనది.. బ్రిటీష్ వారు చంపేసి వెళ్లిపోతుండగా చనిపోయిన వ్యక్తి చేతిలో ఒక ఇష్టమైన వారి మెడలోని తాయత్తును చూపిస్తూ దూరానా బ్రిటీష్ వారిని మసకగా చూపించిన సీన్ మొత్తం పాటకే హైలెట్ అని చెప్పొచ్చు.
Also Read: ఆర్‌ఆర్‌ఆర్ మూవీ నుంచి జనని సాంగ్ విడుదల… గుండెలు పిండేసిన జక్కన్న
అదే కాదు.. బ్రిటీష్ కాల్పులకు పారిపోతూ తమ బిడ్డను కాపాడుకునేందుకు ఇద్దరు యువకులు చనిపోతూ బిడ్డలను విసిరేసిన తీరు కళ్లనీళ్లు తెప్పించక మానదు. ఇక ఇద్దరు చిన్నారులు బ్రిటీషర్ల తుపాకులకు బలి కావడం.. ఒకరేమో అద్దంలోంచి దీనం చూడడం హైలెట్ అని చెప్పొచ్చు. ఇలా ఒక్కో సీన్ ను ఎంతో హృద్యంగా.. మనోహరంగా కళ్లకు కట్టి ‘జనని’ పాటతో ఏడిపించి.. స్వాతంత్య్ర పోరాట కష్టాలను కళ్లకు కట్టిన రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు మనమూ ‘జైహో’ కొట్టాల్సిందే..
ఆర్ఆర్ఆర్ సాంగ్ ఇదే..
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ సోల్ సాంగ్ ‘జనని’.. అందులో ఉన్న డెప్త్ ఏంటేంటే?