RRR Highlights: ‘ఆర్ఆర్ఆర్’ మేనియా జనాలను ఊపేస్తోంది. మరికొన్ని గంటల్లోనే తొలి షో పడబోతుండడంతో ఈ ఊపు మరింత పతాకస్తాయికి చేరుతోంది. బాహుబలితో విశ్వవ్యాప్తం అయిన రాజమౌళి క్రేజ్.. ఇప్పుడు ఆయన తీసిన ‘ఆర్ఆర్ఆర్’తో మరింత పతాకస్థాయికి పెరిగింది.ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్లు, పోస్టర్లు గూస్ బాంబ్స్ కలిగించేలా ఉన్నాయి.ఈ సినిమా కోసం కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు.. దేశమంతా వేచిచూస్తోంది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ భారీగా వస్తున్నాయని తెలుస్తోంది.
చరిత్రలో ఎక్కడా కలవని ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కథను ఫిక్షనల్ గా తెరకెక్కించాడు రాజమౌళి. కొమురం భీంగా ఎన్టీఆర్ , అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటించారు. ఈ సినిమా ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ పడిపోయాయి. దీంతో టాక్ బయటకు వచ్చేసింది. సినిమాలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.
-ఆర్ఆర్ఆర్ మూవీలోని 8 ప్రధాన హైలెట్స్ ఇవే
-ఆర్ఆర్ఆర్ సినిమాలో రాంచరణ్ సరసన నటించిన ఆలియాభట్ కేవలం 20 నిమిషాలు మాత్రమే కనిపించిదని తెలిసింది. ఈమెకు చిన్నపాత్రకే 10 కోట్లకు పైగా పారితోషకం ఇచ్చినట్టు భోగట్టా
Also Read: RRR AP & Telangana First Day Collections: ‘ఆర్ఆర్ఆర్’ ఏపీ & తెలంగాణ ఫస్ట్ డే కలెక్షన్స్
-ఇక సినిమాలో కేవలం ఓ 10 నిమిషాలలోపే పాత్రలో అజయ్ దేవగణ్ కనిపించారు. ఇందుకు ఆయనకు హిందీ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని 20 కోట్ల వరకూ ఇచ్చినట్టు సమాచారం.
-హాలీవుడ్ నుంచి వచ్చిన ఒలివియా పాత్ర నిడివి కూడా తక్కువేనట.. ఆమెకు దాదాపు కోటి రూపాయలు పారితోషికం ఇచ్చినట్టు టాక్.
-ఇక సినిమాలో అజయ్ దేవగణ్ కు జోడీగా చిన్న పాత్రలోనే శ్రియా నటించింది. ఈమె నిడివి కూడా 10 నిమిషాలలోపేనని అంటున్నారు.
-ఆర్ఆర్ఆర్ సినిమాలో బ్రిటీష్ సైన్యంలో రాంచరణ్ తోపాటు తోడుగా ఉండే పాత్రలో సముద్రఖని నటించారు.
-ఇక ఆర్ఆర్ఆర్ లో చాలా మంది ఫారిన్ యాక్టర్స్ ను తీసుకున్నట్టు చిత్రం చూసిన వారు చెబుతున్నారు. వారి సంఖ్య భారీగా ఉందట..
-సినిమాలో హైలెట్ గా వీఎఫ్ఎక్స్ ను చెబుతున్నారు. దీని కోసం భారీగా ఖర్చు చేసినట్టు సినిమా రిచ్ నెస్ ను బట్టి తెలుస్తోంది.
-సినిమాలో ఇంటర్వెల్ కు ముందు రాంచరణ్, ఎన్టీఆర్ లు కొదమ సింహాల్లో కొట్టుకునే సీన్ సినిమాకే హైలెట్ అంటున్నారు
Also Read: Raja Mouli: అది విడుదలయ్యి ఉంటే రాజమౌళి ఇప్పుడు హీరో అయ్యేవాడే!