Golden Globes: ‘RRR’s ‘Naatu Naatu’ : లాస్ ఏంజెల్స్ వేదికగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరుగుతుంది. ప్రపంచ దేశాల చిత్ర ప్రముఖులు ఈ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఈవెంట్ కి హాజరయ్యారు. ఇండియాకు ఆర్ ఆర్ ఆర్ మూవీతో ప్రాతినిధ్యం లభించింది. రెండు విభాగాల్లో ఆర్ ఆర్ ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కి నామినేట్ అయ్యింది. ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్ యూనిట్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలో మెరిశారు. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్,కీరవాణి సతీసమేతంగా హాజరయ్యారు. వీరితో పాటు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ, రాజమౌళి కుమారుడు కార్తికేయ పాల్గొన్నారు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక కోసం ఆర్ ఆర్ ఆర్ టీమ్ ప్రత్యేకంగా తయారయ్యారు. దర్శకుడు రాజమౌళి భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా రెడ్ బ్లాక్ కాంబినేషన్ తో కూడిన షేర్వాణీ ధరించారు. ఇక రామ్ చరణ్ బ్లాక్ కలర్ ఇండో-వెస్ట్రన్ డ్రెస్ ధరించారు. ఎన్టీఆర్ వారికి భిన్నంగా టక్సేడో సూట్ లో మెరిశారు. ఎన్టీఆర్ డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా భార్య లక్ష్మీ ప్రణతి స్లీవ్ లెస్ ఫ్రాక్ ధరించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి లుక్స్ కట్టిపడేస్తున్నాయి.
కాగా ఆర్ ఆర్ ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంటే మరో ప్రతిష్టాత్మక అవార్డు ఆ చిత్ర ఖాతాలో లో చేరినట్లే. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ పలు అంతర్జాతీయ గౌరవాలు సొంతం చేసుకుంది. రాజమౌళి హాలీవుడ్ మేకర్స్ చేత కీర్తించబడుతున్నాడు. ఆయనకు ఉత్తమ దర్శకుడిగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు దక్కింది. ఆల్రెడీ ఆస్కార్ బరిలో నిలిచింది. నామినేషన్లో ఆర్ ఆర్ ఆర్ షార్ట్ లిస్ట్ అయ్యింది.
కాగా ఆర్ ఆర్ ఆర్ నిర్మాత డివివి దానయ్య గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కి హాజరుకాలేదు. ఆయనకు బదులు బాహుబలి చిత్రాల నిర్మాత శోభు యార్లగడ్డ కనిపిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆయనకున్న సంబంధం ఏమిటో అర్థం కావడం లేదు. ఆర్ ఆర్ ఆర్ ఇన్ని అరుదైన గౌరవాలు అందుకుంటున్నప్పటికీ నిర్మాత డివివి దానయ్య ప్రస్తావనే రావడం లేదు. దానయ్యకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు. అంత మాత్రాన ఆయన్ని పక్కన పెట్టేయడం ఏమిటో?. ఆర్ ఆర్ ఆర్ హీరోలు, దర్శకుడు ఆయన గురించి మాట్లాడిందే లేదు.