Roja Home tour: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ప్రారంభమైన రోజా ప్రస్థానం ప్రస్తుతం ఎమ్మెల్యే వరకూ సాగింది. మంత్రి పదవి తృటిలో చేజారింది. బుల్లితెరపై సందడి చేస్తూ రాజకీయాల్లో, సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించింది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అనిపించుకుంది.

అయితే రోజా ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది..? మొదటి సారి ఆమె తన ఇంటి గురించి హోమ్ టూర్ చేసింది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నటిగా అవకాశాలు కనుమరుగైన సమయంలో రోజా రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పటికీ పలు సినిమాలు, టీవీ షోలు చేస్తూ రాజకీయం నడుపుతున్నారు. 2002లో దర్శకుడిగా కొనసాగుతున్న సెల్వమణిని రోజా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె తెలుగుదేశం పార్టీలో చేరి తన మాట చేష్టలతో పాపులర్ అయ్యారు.
అనంతరం వైఎస్ఆర్ సమక్షంలో కాంగ్రెస్ లోకి.. అనంతరం ఆయన మరణం తర్వాత వైసీపీలో చేరారు. 2014లో నగరి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. దీంతోపాటు జబర్ధస్త్ , బతుకు జట్కా బండిలాంటి టీవీ షోలతో జనాలకు చేరువయ్యారు. రాజకీయాన్ని, టీవీ ఇండస్ట్రీని సమయంగా చూస్తూ వస్తున్నారు.
https://www.youtube.com/watch?v=zVNzm6EvwxY&t=21s
ఈ క్రమంలోనే రోజా మొదటిసారి తన ఇంటిపై హోమ్ టూర్ చేసింది. ఇంటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు తమ హోం టూర్ చేస్తున్నారు. ఇటీవల మోహన్ బాబు విశాఖలమైన ఇంటిని ఆయన కూతురు మంచు లక్ష్మీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
రోజా మాత్రం ఒక ప్రముఖ టీవీ చానెల్ నిర్వహించిన ప్రోగ్రాంలో తన హోమ్ టూర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తిరుపతి నగరంలో ఉన్న రోజా ఇల్లు ఇంద్రభవనాన్ని తలపించేలా ఉంది. ఇంట్లోకి రాగానే వేంకటేశ్వరస్వామి ఫొటోతో స్వాగతం పలికేలా పెట్టిన రోజా అనంతరం పూజగది, బెడ్ రూమ్స్ కూడా చూపించారు. ఆ ఇల్లు భారీతనం చూసి ఇప్పుడు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.