Cinema Viral : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించాలని ఉందని జబర్దస్త్ జడ్జి రోజా చెప్పారు. హోమ్ టూర్ పేరుతో ఇటీవల రోజా ఇంట్లో హైపర్ ఆది టీమ్ స్కిట్ చేసింది. అక్కడ హాల్‌లో బాలాజి విగ్రహం ఉంది. ఆయన్ని ఏం కోరుకుంటారమ్మా అని ఆది అడిగితే.. ‘కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబుతో సినిమా చేయాలని ఉంది’ అని రోజా తెలిపారు. ‘కృష్ణా రామా అని ఇంట్లో కూర్చోవాల్సిన వయసులో మనకెందుకమ్మా ఈ మహేష్ బాబు సినిమాలు’ అంటూ ఆది సెటైర్ వేశాడు.

మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ప్రముఖ అథ్లెట్, మహాభారతం సీరియల్ నటుడు ప్రవీణ్ కుమార్ సోబ్తి(74) కన్నుమూశారు. గుండెపోటుతో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మహాభారతంలో భీముడి పాత్ర పోషించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రవీణ్.. క్రీడల్లోనూ రాణించారు. ఏషియన్ గేమ్స్‌లో 4 పతకాలు సాధించారు. 1968, 1972 ఒలింపిక్స్ గేమ్స్‌లో భారత్ తరపున ప్రాతినిథ్యం వహించారు. ప్రతిష్టాత్మక అర్జున అవార్డు గెలుచుకున్నారు. పలు సినిమాల్లో నటించారు.
Also Read: ఈ వారం అలరించబోతున్న చిత్రాలివే !

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ప్రేమికుల రోజున రాధేశ్యామ్ టీం సర్‌ప్రైజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేసింది. మార్చి 11న రాధేశ్యామ్ మూవీ విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరుపుకున్న ఈ మూవీ మళ్లీ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. నైట్ థీమ్ పార్టీ పేరుతో కొత్త రకంగా ప్రమోట్ చేయనున్నారు.

ఇందుకోసం హైదరాబాద్‌లోని కెమిస్ట్రీ క్లబ్‌లో ప్రత్యేకంగా సెట్ వేయనున్నారు. ఈ నైట్ థీమ్ పార్టీకి చిత్ర యూనిట్ హాజరుకానుంది. మొత్తానికి ప్రేమికుల రోజున రాధేశ్యామ్ సర్‌ప్రైజ్ ఈవెంట్ జరగబోతుంది.
Also Read: లవ్ జిహాదీలకు పదేళ్ల శిక్షః యూపీలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల