Bigg Boss Telugu 6: బిగ్ బాస్: రోహిత్ ను పిచ్చి పుల్లయ్యను చేసేశారు.. గీతూ సెంటిమెంట్ కు కరగలేదు..

Bigg Boss Telugu 6: బిగ్ బాస్ ఈ గురువారం ఎపిసోడ్ మొత్తం సెంటిమెంట్ తో నింపేశాడు. ఇంటి సభ్యులతో ‘రీచార్జ్’ గేమ్ ఆడించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించే గేమ్ ను రక్తికట్టించాడు. ఎమోషనల్ గా వారి వీక్ నెస్ ను పరీక్షించాడు. ఈ పరీక్షలో పలువురు తమ వారు గుర్తుకు వచ్చి ఏడ్చేయగా.. మరికొందరు త్యాగాలు చేస్తూ కన్నీళ్లు పర్యంతం అయ్యారు. అందరికంటే రోహిత్ ఇందులో పిచ్చి పుల్లయ్యలా మారిపోయాడు. తోటి కంటెస్టెంట్లు ఇంటి […]

Written By: NARESH, Updated On : October 13, 2022 11:13 pm
Follow us on

Bigg Boss Telugu 6: బిగ్ బాస్ ఈ గురువారం ఎపిసోడ్ మొత్తం సెంటిమెంట్ తో నింపేశాడు. ఇంటి సభ్యులతో ‘రీచార్జ్’ గేమ్ ఆడించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించే గేమ్ ను రక్తికట్టించాడు. ఎమోషనల్ గా వారి వీక్ నెస్ ను పరీక్షించాడు. ఈ పరీక్షలో పలువురు తమ వారు గుర్తుకు వచ్చి ఏడ్చేయగా.. మరికొందరు త్యాగాలు చేస్తూ కన్నీళ్లు పర్యంతం అయ్యారు. అందరికంటే రోహిత్ ఇందులో పిచ్చి పుల్లయ్యలా మారిపోయాడు. తోటి కంటెస్టెంట్లు ఇంటి సభ్యులతో మాట్లాడేందుకు తను త్యాగశీలిగా మారాడు. తర్వాత అలా మారినందుకు ఆ స్వార్థపు వ్యక్తుల చేష్టలకు బాధపడ్డాడు.

మెరినా రోహిత్ జంటను విడదీసిన బిగ్ బాస్ వారిద్దరికీ వేర్వేరు కంటెస్టెంట్లుగా పరిగణించాడు. అయితే రోహిత్ , వాసంతిలలో రెండు వారాలు ఎవరైతే నామినేషన్స్ తీసుకుంటారో వారి వల్ల ఇంటి రీచార్జ్ 100శాతం పెరుగుతుందని.. తద్వారా హౌస్ మేట్స్ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం లభిస్తుందని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. దీనికి వాసంతి తాను ఆల్ రెడీ నామినేషన్ లో ఉండడంతో రోహిత్ ను తీసుకోవాలని పురమాయించింది. దానికి నమ్మిన రోహిత్ ఇంటి సభ్యుల కోసం వచ్చే రెండు వారాలు నామినేషన్ తీసుకున్నాడు. తర్వాత అందరూ కలిసి రోహిత్ ను ఇరికించారని తెలుసుకొని బాధపడ్డారు. స్వార్థ మనుషులు అని తెలుసుకొని కన్నీళ్ల పెట్టుకున్నాడు.

ఇక బిగ్ బాస్ ఇలా అందరినీ ఫోన్ కాల్, లెటర్, ఫొటో, వీడియో కాల్ అంటూ ఎమోషన్ ను తట్టి లేపాడు. అందరికంటే సూర్య వారి అమ్మతో ఫోన్ కాల్ మాట్లాడనందుకు బాధపడ్డాడు.

ఇక కెప్టెన్సీ టాస్క్ 8 బాల్స్ పెట్టి కొట్టుకుచావండి మాకు ఎంటర్ టైన్ మెంట్ పంచండి అంటూ బిగ్ బాస్ ఓ గేమ్ ఆడించాడు. ఇందులో బాల్స్ చేజిక్కించుకున్న 8 మందిని కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక చేశారు. ఇందులో రోహిత్ బాల్ ను దక్కించుకోలేక హౌస్ మేట్స్ ముందు బిక్కమొహం వేశాడు.

ఇక ఫిజికల్ టాస్క్ కావడంతో బాల్ దక్కించుకోలేకపోయిన గలాట గీతు తనకు బాల్ ఇవ్వాలని రేవంత్ ను, తన ఫ్రెండ్ అయిన ఆదిరెడ్డికి సెంటిమెంట్ మాటలు చెబుతూ కలరింగ్ ఇచ్చింది. ఆమె బుట్టలో పడని రేవంత్, ఆదిరెడ్డిలు బాల్ ఇచ్చి కెప్టెన్సీ పోటీ నుంచి తప్పుకోవడానికి ఇష్టపడలేదు. గీతూ ఆటలు వారి వద్ద సాగలేదు.

ఇలా ఫోన్ కాల్స్ తో ఎమోషన్, కెప్టెన్సీ టాస్క్ తో ఎలివేషన్ ను గురువారం పంచాడు బిగ్ బాస్. ఇందులో రోహిత్ బలికాగా.. ఇంటి సభ్యులకు మాట్లాడే అవకాశం దక్కింది. గీతూ కెప్టెన్సీ ఆటలు పారకపోవడం కొసమెరుపు.