
Indian Cricketers Holi Celebration: హోలీ సెలబ్రేషన్స్ ఈసారి దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులు ఈ సంబరాల్లో మునిగితేలారు. ఇక క్రికెటర్లు వారు ఉన్న ప్రదేశంలోనే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీమిండియా చేసుకున్న సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి, ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ రంగులు పూస్తున్న వీడియోను శుభ్ మన్ గిల్ తీశాడు. ఈ సందర్భంగా మిగతా క్రికెటర్లు రంగుల పూసుకొని కనిపించారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న సీరిస్ లో భాగంగా చివరి టెస్ట్ 9 నుంచి గుజరాత్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ సందర్భంగా గుజరాత్ లో ట్రైనీ మ్యాచ్ కు వెళ్లిన సందర్భంగా బస్సులో ఉన్న క్రికెటర్లు హోలీ సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ కనిపించారు. బస్సులోనే ఎంజాయ్ చేశారు. వీరికి సంబంధించిన వీడియోను శుభ్ మన్ గిల్ వీడియో తీశాడు. తాను కూడా ప్రత్యేకమైన రంగులు పూసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ గా మారింది.

ఇక 2-1 మ్యాచ్ లతో భారత్ గురువారం చివరి టెస్ట్ కోసం బరిలోకి దిగనుంది. ఈ టెస్ట్ లో విన్నయితేనే ట్రోఫీ దక్కే ఛాన్స్ ఉంది. అటు అస్ట్రేలియాలో మెయిన్ వికెట్స్ గాయాలు, తదితర కారణాలతో దూరంగా ఉన్నాయి. అయినా మూడో మ్యాచ్ ను గెలిచారు. అయితే ఈ ఓటమికి పిచ్ అంచనా వేయలేకపోవడం కారణమని కొందరు చర్చించుకున్నారు. ఏదే ఏమైనా చివరి మ్యాచ్ ఉత్కంఠగా సాగనుంది. మరోవైపు ఈ టెస్ట్ మొదటి రోజు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోది, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి అంథోనిలు ఇద్దరూ హాజరు కానున్నారు. దీంతో ఈ మ్యాచ్ పై మరింత ఆసక్తి నెలకొంది.
Indian players celebrating Holi. pic.twitter.com/GSGsQqTDkZ
— Johns. (@CricCrazyJohns) March 7, 2023