
Ritika Varma: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 32 రోజుల పాటు కారులో ఉండడం ఎవరికైనా సాధ్యమా? అందులోనూ అందమైన హీరోయిన్లు దీనిని ఒప్పుకుంటారా? హీరోయిన్లు ఎక్కవగా సాఫ్ట్ క్యారెక్టర్ ను కోరుకుంటారు. ప్రయోగాల జోలికి వెళ్లరు. కానీ 32 రోజుల పాటు ఓ స్టార్ హీరోయిన్ చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. ప్రతీ సినిమాను ఒక సవాల్ గా తీసుకొని ప్రయోగాలు చేసే ఆ హీరోయిన్ మాట్లాడుతూ ఇది తనకు జీవితంలోనే మొదటి అనుభవం అని అంటోంది. సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఆ హీరోయిన్ ఎవరు? ఇంతకు ఆ హీరోయిన్ 32 రోజుల పాటు కారులో ఏం చేసింది?
‘గురు’ సినిమా అనగానే విక్టరీ వెంకటేశ్ తో పాటు అందులో నటించిన భామ రీతికా వర్మ గుర్తుకొస్తుంది. జింకపిల్లలా చెంగుమనుకుంటూ నటించిన ఈ భామకు బేసిగ్గా కరాటే తెలుసు. ఆ అనుభవంతోనే ‘గురు’లో బాక్సర్ గా నటించింది. అంతకుముందు తమిళంలో ఈ భామ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ‘గురు’తో ఫేమస్ అయింది. ఆ తరువాత ‘నీవెవెరో’, రాఘవ లారెన్స్ ‘కాంచన 3’ లో మెరిసింది. ఆ తరువాత చాలా రోజుల పాటు ఈ హీరోయిన్ మళ్లీ తెలుగు తెరపై కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ఆమె నటించిన ఓ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాలో ఈ భామ ఓ ప్రయోగం చేసింది.
రీతికా సింగ్ నటించిన లెటెస్ట్ మూవీ ‘ఇన్ కార్’. హర్షవర్దన్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో రీతికా ప్రధాన రోల్ లో నటిస్తోంది. సర్వైవర్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఇందులో సందీప్ గోయత్, మనీష్, వెంకీ, సోనిలు కీలక పాత్రలో నటిస్తున్నారు. యధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఖురేషి, సాజిద్ లు నిర్మిస్తున్నారు. దీనిని మార్చి 3న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రీతికా పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా రీతికా వర్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఈ సందర్భంగా ఆమె షాకింగ్ విషయాలు చెప్పింది. ‘ఇన్ కార్’ సినిమా కోసం రీతికా వర్మ తీవ్రంగా కష్టపడిందట. 32 రోజుల పాటు ఆమె కారులోనే ఉండిపోయిందట. ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా కారులో షూటింగ్ చేశారని, అయితే ఈ షూటింగ్ జరిగినన్ని రోజులు తల స్నానం చేయకుండా షూటింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పింది. సాధారణంగా వారంలో రెండు లేదా అంతకంటే ఎక్కువగా తలస్నానం చేస్తానని, ఈ షూటింగ్ కోసం 32 రోజుల పాటు స్నానం చేయలేదని పేర్కొంది. తల నుంచి స్మెల్ వస్తున్నా.. షూటింగ్ కోసం కష్టపడ్డానని చెప్పుకొచ్చింది.
ప్రయోగాత్మక చిత్రాలు తీసే రీతికా వర్మ ఈ సినిమాను సవాల్ గా తీసుకుంది. తెలుగులో ఈ భామ పెద్దగా కనిపించకపోయినా తమిళ, మలమాళ చిత్రాలో వరుసగా నటిస్తూ వస్తోంది. అయితే అవి పెద్దగా పేరుకు తీసుకురాలేకపోయాయి. తాజాగా ఆమె నటించిన ‘ఇన్ కార్’ చిత్రం పై భారీ హోప్ పెట్టుకుంది. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతోందని రీతికా వర్మ చెప్పుకొచ్చారు.