
Lalitha Jewellery Kiran Kumar: ఒక ప్రొడక్ట్ ను జనాల్లోకి తీసుకెళ్లాలంటే దానికి అడ్వర్టయిజ్మెంట్ కావాలి. అందుకోసం మోడల్స్, లోకేషన్స్ తదితర హంగులతో కస్టమర్లను అట్రాక్ట్ చేయాలి. ఇలా చేయడానికి కనీసం కోటి రూపాయల ఖర్చు కావచ్చు. అప్పటికీ కొంత మంది వినియోగదారులను ఆకట్టుకోకపోవచ్చు. కానీ అలాంటి ఆర్భాటమేమి లేకుండా కేవలం చిన్న మాటలతో మిడిల్ క్లాస్ కు సైతం అర్థమయ్యేలా లలిత జువెల్లరీని ప్రచారం చేసిన కిరణ్ కుమార్ గురించి తెలియని వారుండరు. తన కంపెనీకి తానే అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన మీడియాలోనూ సెలబ్రెటీగా మారిపోయాడు.ఈ నేపథ్యంలో ఆయన గురించి తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకున్న కార్ల గురించి చెప్పడం ఆసక్తిగా మారింది.
జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదుగుతారు.. కానీ ఎదిగే కొద్దీ ఒదుగుదల ఉండడమే మంచిదని కిరణ్ కుమార్ అంటారు. అయితే కొందరు డబ్బుల రాగానే పట్టించుకోవడం లేదని అంటూంటారు. కానీ వారికున్న బీజీ లైఫ్ లో వారు పనులు చేసుకుంటూ ఉంటారు.. అంతేగాని ఇతరులను పట్టించుకోవడం అనేది ఉండదని కిరణ్ కుమార్ ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తన స్నేహితులతో ఇప్పటికీ మాట్లాడుతానని, ఎంత డబ్బు సంపాదించినా పాత రోజుల్లాగే ఉండడం తనకు ఇష్టమని చెప్పారు.
నెల్లూరులో జన్మించిన కిరణ్ ఇప్పటికీ అందరినీ కలుస్తూ ఉంటానని చెబుతున్నారు. అక్కడి నుంచి తమిళనాడు వెళ్లి స్థిరపడ్డానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ తనకున్న హాబిట్స్ గురించి చెప్పారు. తాను ఎప్పుడూ టీషర్ట్ లోనే కనిపిస్తానని, ఎప్పుడూ షర్ట్స్ వేసుకోనని చెప్పారు. ఎంత పెద్ద కార్యక్రమమైనా టీషర్ట్ వేసుకుంటానని, ఇదే కంపోర్టుగా ఉంటుందని చెప్పారు. ఇక తనకు 40 కార్లు ఉన్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఆయన కొనుగోలు చేసిన ఏ కారును తిరిగి అమ్మలేదట. తన మొదటి కారు‘సీల్’ ను 60 వేలు ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేశానని చెప్పారు. తనకున్న కార్లలో ల్యాండ్ క్రూజైర్ బాగా ఇష్టమని చెప్పారు. ఈ కారు మీద కూర్చుంటే తనకు ఏనుగుమీద కూర్చున్నట్లు ఉంటుందని అన్నారు.

అలాగే మనం చేసే పుణ్యంతోనే ఎదుగుదల ఉంటుందని, ఈ విషయంలో నేనెప్పుడు అలాగే ఉన్నానని అన్నారు. ఇప్పటి వరకైతే ఎవరిని నొప్పించలేదని చెప్పారు. ఇక అమ్మ ఆశీర్వాదంతోనే తాను ఎదిగానని కిరణ్ కుమార్ చెప్పుకొచ్చారు. తల్లి గాజులు అమ్మేసి వ్యాపారం మొదలుపెట్టిన ఆయన ఇప్పడు ప్రపంచంలోనే గుర్తింపు పొందిన వ్యక్తిగా ఎదిగారు. వేలకోట్ల బిజినెస్ చేస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అమ్మానాన్నల ఆశీర్వాదం ప్రతి ఒక్కరికీ అవసరం అని చెప్పారు.