
మనలో చాలామంది బైక్ ను నడిపే సమయంలో చెప్పులతో బైక్ ను నడుపుతూ ఉంటారు. అయితే బైక్ నడిపేటప్పుడు షూ ధరించకపోతే 1,000 రూపాయల ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఎప్పటినుంచో ఈ నిబంధన ఉన్నా ట్రాఫిక్ పోలీసులు మాత్రం చాలా ప్రాంతాల్లో ఈ నిబంధనను అమలు చేయడం లేదు. నిబంధనల ప్రకారం షూ లేకుండా బైక్ నడిపితే ఏకంగా వెయ్యి రూపాయల ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ 2019 సంవత్సరంలో మోటార్ వాహనాల చట్టాన్ని సవరించిన సంగతి తెలిసిందే. సవరించిన చట్టం ప్రకారం కేంద్రం ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం పాదాలు కనిపించే విధంగా బైక్ ను నడపడం బ్నేరం కావడం గమనార్హం సాధారణంగా బూట్లతో పోలిస్తే చెప్పులకు పటుత్వం ఉండదనే సంగతి తెలిసిందే.
చెప్పులకు పటుత్వం లేకపోవడం వల్ల బైక్ గేర్ మార్చే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. రద్దీగా ఉండే ప్రదేశాలలో గేర్ ను వేగంగా మార్చని పక్షంలో ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చెప్పులు పాదాలకు తగినంత రక్షణ ఇవ్వలేవు. చెప్పులకు తగినంత రక్షణ లేకపోతే గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. క్వాలిటీ హెల్మెట్, షూ బైక్ నడిపే ఉండే సమయంలో కచ్చితంగా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి.
వాహనదారులలో క్రమశిక్షణను అలవరచాలనే ఉద్దేశంతో కేంద్రం 2019 సంవత్సరంలో మోటార్ వాహనాల చట్టంలో కీలక సవరణలు చేసింది. ఈ సవరణల వల్ల ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాళ్లు భారీ మొత్తంలో జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది.