Pigeon Meat: ప్రస్తుత కాలంలో హోటల్ కు వెళ్లాలంటేనే భయమేస్తోంది. మనం ఏం అడిగితే వారు ఏం పెడతారోననే సందేహం వస్తోంది. దీంతో హోటల్, రెస్టారెంట్లలో తినేందుకు ముందుకు రావడానికి ఇష్టపడటం లేదు. మనం ఏం అడిగితే వారు ఏం పెడతారో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో మనం తినే పదార్థాలు ఏంటో అని తెలియడ లేదు. మాంసాహారం అడిగితే ఏం పెడుతున్నారో కూడా అర్థం కాదు. ఇక చికెన్ అని ఇతర పదార్థాలు కూడా పెడుతున్నట్లు పలు సందర్భాల్లో రుజువులు వచ్చాయి.

ముంబైలోని మతుంగ ఈస్ట్ లో ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పావురాలను రెస్టారెంట్ కు విక్రయిస్తున్నాడు. దాని యజమాని వాటిని చంపి చికెన్ గా తన రెస్టారెంట్ కు వచ్చిన వారికి పెడుతున్నాడు. దీన్ని ఓ ఆర్మీ మాజీ అధికారి కంటబడింది. దీంతో అతడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. పోలీసులు పలు సెక్షన్ల కింద హోటల్ యజమానిపై కేసు నమోదు చేశారు. పావురాలను చంపి చికెన్ గా రెస్టారెంట్ కు వచ్చిన వారికి పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
అభిషేక్ అనే వ్యక్తి అపార్ట్ మెంట్ పైన పావురాలు పెంచుతున్నాడు. వాటిని సమీపంలోని రెస్టారెంట్ లో అమ్ముతున్నాడు. రెస్టారెంట్ యజమాని వాటిని చంపుతూ వంటకాలు చేస్తూ చికెన్ అని వినియోగదారులను మోసం చేస్తున్నాడు. ఇది గమనించిన ఆర్మీ మాజీ అధికారి ఫిర్యాదుతో విషయం బయటపడింది. ఆర్మీ మాజీ అధికారి ఫిర్యాదులో వాస్తవం లేదని నిందితుడు అభిషేక్, స్థానిక హౌసింగ్ కమిటీ సభ్యుడు, అపార్ట్ మెంట్ యజమాని చెబుతున్నారు. గతంలో కూడా ఆర్మీ మాజీ అధికారి ఇలాగే ఫిర్యాదు చేశారని అంటున్నారు.

పావురాలను చంపిన విషయంలో ఆధారాలు లేవని ప్రశ్నించారు. కానీ ఆర్మీ మాజీ అధికారి మాత్రం వారికి వీడియో ఆధారాలు అందజేశానని చెబుతున్నారు. దీంతో దీనిపై విచారణ చేసి నిజానిజాలు వెలికితీయాలని కోరుతున్నారు. పావురాలను చంపి చికెన్ గా చెప్పి మోసం చేస్తే కచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాల్సిందేననే వాదనలు వస్తున్నాయి. దీంతో ఎవరి వాదన నిజమో తెలియని పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి విచారణ చేసి నిజాలు వెలికితీసి నేరం రుజువైతే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.