Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి ఎదుగుదలని చూసి నాలుగు దశాబ్దాల నుండి కుళ్ళుకుంటున్న ఒక వర్గపు మీడియా, మెగాస్టార్ గత రెండు చిత్రాలు సరిగా ఆడకపొయ్యేసరికి ఇక ఆయన పని అయ్యిపోయిందంటూ రుద్దడం ప్రారంభించాయి..తమ వర్గపు హీరో కి సంబంధించిన సినిమా పోటీలో ఉండడం తో చిరంజీవిని ఆ హీరో ముందు తక్కువ చేసి చూపించడానికి ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్ని ప్రయత్నాలు చేసాయి..సినిమా బాగున్నప్పటికీ కూడా బాలేదు అంటూ డిజాస్టర్ రేటింగ్స్ ఇచ్చాయి.

వాళ్ళు రేటింగ్స్ ఇచ్చిన సమయంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా షోస్ ప్రారంభం కాలేదు..తెల్లవారుజామున లేచి రివ్యూస్ ఏమిటో చూద్దాం అని చూసిన అభిమానులకు పెద్ద షాక్ తగిలింది..ఇదేంటి ఈ సినిమా కూడా పొయ్యినట్టేనా అని ఫీల్ అయ్యారు..కానీ మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రేంజ్ మ్యాజిక్ చేస్తాడని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు..అభిమానులకు కూడా మతి పొయ్యే రేంజ్ వసూళ్లను రాబడుతూ సంచలనం సృష్టించాడు.
ఇది ఇలా ఉండగా మొదటి రోజు మాత్రం ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కంటే ‘వీర సింహా రెడ్డి’ కి ఎక్కువ థియేటర్స్ కేటాయించారు బయ్యర్లు..’వాల్తేరు వీరయ్య’ విడుదలైనప్పుడు కూడా ‘వీర సింహా రెడ్డి’ కి అత్యధిక థియేటర్స్ ఉన్నాయి..కానీ ప్రేక్షకుల నుండి మరియు అభిమానుల నుండి ‘వాల్తేరు వీరయ్య’ మూవీ టికెట్స్ కోసం తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది..థియేటర్స్ సరిపోలేకపొయ్యేసరికి బయ్యర్స్ ‘వీర సింహా రెడ్డి’ సినిమాకి కేటాయించిన థియేటర్స్ ని ‘వాల్తేరు వీరయ్య’ కి ఇచ్చేసారు..దీనిపై నందమూరి అభిమానులు సోషల్ మీడియా లో నిరసన వ్యక్తం చేసారు..చిరంజీవి కావాలనే మాఫియా ని దింపి మా థియేటర్స్ మొత్తాన్ని లాగేసుకుంటున్నాడని నందమూరి అభిమానులు సోషల్ మీడియా గొడవకి దిగారు.

అయితే ఉన్న థియేటర్స్ ని సరిగా నింపుకోలేకున్నారు..మీకు ఎవరిస్తారు ఎక్కువ థియేటర్స్..డిమాండ్ ని బట్టే ఏదైనా ఉంటుంది అంటూ మెగా ఫ్యాన్స్ చెప్తున్నారు..బయ్యర్స్ నుండి కూడా ఇదేమాట..’వాల్తేరు వీరయ్య’ కి డిమాండ్ విపరీతంగా ఉంది అందుకే థియేటర్స్ ఇచ్చేస్తున్నాము అని చెప్పుకొస్తున్నారు.