https://oktelugu.com/

Ready Made Fan : షర్టుతో రెడీమేడ్ ఫ్యాన్.. ఈ కూలీ అద్భుతమే చేశాడు

క్కడ ఓ డ్రిల్లింగ్ మిషన్ కు కూలి తన షర్ట్ ను కట్టాడు. డ్రిల్లింగ్ మిషన్ ను పైన ఉంచాడు. ఆ తరువాత దాని ప్లగ్ ను కరెంట్ లో పెట్టాడు. ఇంకేముంది.. డ్రిల్లింగ్ మిషన్ తిరుగుతుండగా దానికున్న షర్ట్ ఫ్యాన్ వలె తిరుగసాగింది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 7, 2023 / 12:53 PM IST
    Follow us on

    Ready Made Fan : ఎండలు మరోసారి దంచికొడుతున్నాయి. కొన్ని రోజుల పాటు వర్షాలతో వాతావరణం చల్లబడ్డా.. ఉక్కపోత మళ్లీ స్టార్ట్ అయింది. ఈ తరుణంలో వేడి నుంచి తట్టుకోవడానికి జనం కూలర్లు, ఏసీలను ఆన్ చేస్తోంది. మరికొందరు చల్లగాలి వచ్చే ఇతర ఏర్పాట్లను చేసుకుంటున్నారు. వేసవిలో కూలీ పని చేసేవారికి కష్టం చెప్పతరం కాదు. ఎంత ఎండ ఉన్నా వాళ్లు తమ పని చేయనిది కడుపు నిండదు. ఈ సమయంలో వారు చల్లదనం గురించి ఆలోచించరు. ఎండలోనే మాడుతూ తమ పనిని కొనసాగిస్తారు.

    అయితే మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత కాసేపు రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అయిన ఈ సమయంలో వారు నీడ వచ్చే చల్లటి ప్రదేశంలో సేద తీరుతారు.  వారికి పనిచేసే చోట ఫ్యాన్లు, కూలర్లు ఉండవు గనుక ఆ కొద్ది సమయం అలా గడిపేస్తారు. అయితే ఓ కూలీ మాత్రం ఆ  సమయంలో వినూత్నంగా ఓ ఫ్యాన్ ను తయారు చేసుకున్నాడు. ఆ ఫ్యాన్ కింద రిలాక్స్ అయ్యాడు. ఏ ఇంజనీర్ చేయలేని పనిని ఈ కూలీ చేయడంతో అందరూ ఆయనను అభినందిస్తున్నారు.. కానీ కొందరు జాగ్రత్తలు చెబుతున్నారు. ఇంతకీ ఆయన ఏం చేశాడు?

    భవన నిర్మాణ కార్మికులు పనిచేసే చోట ఎండా, వాన లెక్కచేయరు. కాలం ఎలా ఉన్న వారి పనిని కొనసాగిస్తూ ఉంటారు. అయితే మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఓ 20 నిమిషాల పాటు అలా రిలాక్స్ అవుతారు. ఈ సమయంలో ఫ్యాన్ ఉంటే బాగుండు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఓ కూలీ ఈ మాట రాకుండానే వినూత్నంగా ఓ ఫ్యాన్ ను తయారు చేసుకున్నాడు. అప్పటికప్పుడు తయారు చేసిన ఈ ఫ్యాన్ కింద కాసేపు పడుకున్నాడు కూడా.

    కన్ స్ట్రక్షన్ జరుగుతున్న ఓ బిల్డింగ్ లో ఓ ఫ్యాన్ తిరుగుతుంది. దానికి రెక్కలు లేవు. ఓ షర్ట్ ఉంది. అంటే అక్కడ ఓ డ్రిల్లింగ్ మిషన్ కు కూలి తన షర్ట్ ను కట్టాడు. డ్రిల్లింగ్ మిషన్ ను పైన ఉంచాడు. ఆ తరువాత దాని ప్లగ్ ను కరెంట్ లో పెట్టాడు. ఇంకేముంది.. డ్రిల్లింగ్ మిషన్ తిరుగుతుండగా దానికున్న షర్ట్ ఫ్యాన్ వలె తిరుగసాగింది. దీని కింద ఆ కూలీ హాయిగా నిద్రపోయాడు.

    వేసవిలో సేద తీరేందుకు ఈ కూలీ ఏర్పాటు చేసుకున్న తీరును చూసి చాలా మంది అభినందిస్తున్నారు. ఏ ఇంజనీర్ చేయని పని నువ్వు చేశావ్ అంటూ అభినందిస్తున్నారు. అయితే ఇదే సమయంలో జాగ్రత్తలు కూడా చెబుతున్నారు. డ్రిల్లింగ్ మిషన్ మిస్సయి మీద పడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ వీడియో చూసి అక్కడే వదిలేయాలని, ఇలాంటి ప్రయోగాలు ఎవరూ చేయొద్దని సూచిస్తున్నారు. మరి ఆ వీడియో ఎలా ఉందో మీరూ చూసేయండి..