https://oktelugu.com/

RC-15 Title Review: RC-15 టైటిల్ రివ్యూ: ‘గేమ్ ఛేంజర్’ గా రామ్ చరణ్… స్టోరీ ఇదే?

RC-15 Title Review: రామ్ చరణ్ బర్త్ డే పురస్కరించుకుని ఆయన లేటెస్ట్ మూవీ టైటిల్ విడుదల చేశారు. అనూహ్యంగా, ఎవరూ ఊహించని విధంగా ఇంగ్లీష్ టైటిల్ ఫిక్స్ చేశారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న 15వ చిత్ర టైటిల్ ‘గేమ్ ఛేంజర్’ అని ఫిక్స్ చేశారు. ఈ మేరకు నేడు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. టైటిల్ లో అనేక డిటైల్స్ ఉన్నాయి. అవేమిటో గమనిస్తే… టైటిల్ ఇంగ్లీష్ లో పెట్టారు. దానికి ప్రధాన […]

Written By: , Updated On : March 27, 2023 / 09:39 AM IST
Follow us on

RC-15 Title Review

RC-15 Title Review

RC-15 Title Review: రామ్ చరణ్ బర్త్ డే పురస్కరించుకుని ఆయన లేటెస్ట్ మూవీ టైటిల్ విడుదల చేశారు. అనూహ్యంగా, ఎవరూ ఊహించని విధంగా ఇంగ్లీష్ టైటిల్ ఫిక్స్ చేశారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న 15వ చిత్ర టైటిల్ ‘గేమ్ ఛేంజర్’ అని ఫిక్స్ చేశారు. ఈ మేరకు నేడు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. టైటిల్ లో అనేక డిటైల్స్ ఉన్నాయి. అవేమిటో గమనిస్తే… టైటిల్ ఇంగ్లీష్ లో పెట్టారు. దానికి ప్రధాన కారణం.. రామ్ చరణ్. ఆయన ఇమేజ్ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. కాబట్టి ఇతర భాషల్లో, దేశాల్లో విడుదల చేయడానికి అనువుగా ఇంగ్లీష్ టైటిల్ ఎంచుకున్నారు.

మొదటి నుండి ఇది పొలిటికల్ డ్రామా అని ప్రచారం అవుతుంది. టైటిల్ లో దానికి సంబంధించిన హింట్ ఇచ్చారు. లెటర్ జి లో స్వస్తిక్ సింబల్ చూడొచ్చు. ఇండియాలో దాన్ని ఓటుని నిర్ధారించే మార్క్ గా చూస్తారు. అలాగే చెస్ లో రాజును సూచించే పావును కూడా టైటిల్ లో ఇంక్లూడ్ చేశారు. కాబట్టి ఇది పక్కా పొలిటికల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్. ఆల్రెడీ లీకైన ఫోటోలు ఇదే విషయాన్ని వెల్లడించాయి.

ఈ మేరకు ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా కనిపిస్తారట. తండ్రి సామాజిక భావాలు కలిగిన రాజకీయ వేత్త. అయితే ఎన్నికల అధికారుల అవినీతి కారణంగా నష్టపోతారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తండ్రిని మోసగించిన వారికి బుద్ధి చెప్పేందుకు కొడుకు అదే దారి ఎంచుకుంటాడు. ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపడతారు. ఒక లక్ష్యంతో ఎన్నికల అధికారిగా మారిన చరణ్, ఎలా దుర్మార్గులకు ఎలా గుణపాఠం నేర్పాడు అనేదే కథ…

RC-15 Title Review

RC-15 Title Review

నేడు టైటిల్ చూశాక… ఈ ప్రచారంలో నిజం ఉందన్న వాదన బలపడింది. దిల్ రాజు తన బ్యానర్ లో 50వ చిత్రంగా గేమ్ ఛేంజర్ నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. అంజలి మరో కీలక రోల్ చేస్తున్నారు. సునీల్ సైతం ఈ మూవీలో భాగమయ్యారు. వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల కానుంది. రామ్ చరణ్ నుండి మరో భారీ ప్రాజెక్ట్ గా గేమ్ ఛేంజర్ రానుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. 2024 సంక్రాంతికి విడుదలయ్యే సమాచారం కలదు.