https://oktelugu.com/

Ravanasura Trailer Review : దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్.. ఇదే రావణాసుర స్టైల్

Ravanasura Trailer Review : ఈ మధ్యకాలంలో ఫుల్ మాస్, యాక్షన్ సినిమాలతో రవితేజ ఫుల్ ఫాంలో ఉన్నాడు. క్రాక్ తర్వాత పెద్దగా భారీ హిట్ పడలేదు. చిరంజీవితో కలిసి చేసిన ‘వాల్తేరు వీరయ్య’ హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత రవితేజ నుంచి వరుస సినిమాలు ఉన్నాయి. ఈక్రమంలోనే వస్తున్న ‘రావణాసుర’ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. రావణసుర సినిమాలో ఒక లాయర్ పాత్రలో రవితేజ యాక్షన్, కామెడీ పండించారు. రవితేజతోపాటు హైపర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 28, 2023 / 04:32 PM IST
    Follow us on

    Ravanasura Trailer Review : ఈ మధ్యకాలంలో ఫుల్ మాస్, యాక్షన్ సినిమాలతో రవితేజ ఫుల్ ఫాంలో ఉన్నాడు. క్రాక్ తర్వాత పెద్దగా భారీ హిట్ పడలేదు. చిరంజీవితో కలిసి చేసిన ‘వాల్తేరు వీరయ్య’ హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత రవితేజ నుంచి వరుస సినిమాలు ఉన్నాయి. ఈక్రమంలోనే వస్తున్న ‘రావణాసుర’ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

    రావణసుర సినిమాలో ఒక లాయర్ పాత్రలో రవితేజ యాక్షన్, కామెడీ పండించారు. రవితేజతోపాటు హైపర్ ఆది అసిస్టెంట్ గా ఉండడంతో కామెడీ పండింది. ఒక క్రిమినల్ లాయర్ గా రవితేజ క్రిమినల్స్ ను ఏరివేసే విధానం ఇందులో హైలెట్ గా ఉంది..

    హత్య చేయడం క్రైమ్.. కానీ దొరక్కుండా హత్యచేయడం ఆర్ట్ అంటూ లాయర్ గా ఉంటూనే ప్రత్యర్థులను వేటాడే ‘రావణాసురు’డిగా రవితేజ ఇందులో బీభత్సంగా నటించాడు. చివర్లో ఈ భూమ్మీద నన్ను ఆపగలిగేవాడు ఎవడైనా ఉన్నాడంటే అదేనే అంటూ పాత్ర యొక్క స్వభావాన్ని రవితేజ పరిచయం చేశాడు.

    సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందింది. అను ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, దక్ష నగర్కర్ హీరోయిన్లు. ఏప్రిల్ 7న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇప్పటివరకూ చూడని సరికొత్త పాత్రలో రవితేజ నటించాడు. ఆ ట్రైలర్ ను పైన చూడొచ్చు.