Khiladi​ Movie Trailer: డబ్బు కోసం వేట.. ‘ఖిలాడీ’ రవితేజ ఆట ఇదీ!

Khiladi​ Movie Trailer: రవితేజ పూర్తి మాస్ అండ్ స్టైలిష్ యాక్షన్ లుక్ లో దర్శనమిచ్చారు. ఇప్పటివరకూ చేయని విధంగా హీరోయిన్ పెదాలను కొరికేసి హాట్ గా కనిపించారు. రవితేజ హీరోగా.. డింపుల్ హయతీ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా రమేశ్ వర్మ తీస్తున్న మూవీ ‘ఖిలాడీ’. ఈ యాక్షన్ క్రైమ్ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న రిలీజ్ చేయనున్నట్టు ట్రైలర్ లో ప్రకటించారు. ఖిలాడీ ట్రైలర్ చూస్తుంటే రవితేజ […]

Written By: NARESH, Updated On : February 7, 2022 7:01 pm
Follow us on

Khiladi​ Movie Trailer: రవితేజ పూర్తి మాస్ అండ్ స్టైలిష్ యాక్షన్ లుక్ లో దర్శనమిచ్చారు. ఇప్పటివరకూ చేయని విధంగా హీరోయిన్ పెదాలను కొరికేసి హాట్ గా కనిపించారు. రవితేజ హీరోగా.. డింపుల్ హయతీ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా రమేశ్ వర్మ తీస్తున్న మూవీ ‘ఖిలాడీ’. ఈ యాక్షన్ క్రైమ్ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న రిలీజ్ చేయనున్నట్టు ట్రైలర్ లో ప్రకటించారు.

ఖిలాడీ ట్రైలర్ చూస్తుంటే రవితేజ ఇందులో యాక్షన్ ను ఇరగదీస్తూ అదే సమయంలో తొలిసారి హీరోయిన్ కు లిప్ టు లిప్ కిస్ ఇచ్చి రోమాంటిక్ యాంగిల్ ను టచ్ చేయడం విశేషం. పాప కసక్.. నేను ఫసక్ అంటూ ఫుల్ రోమాంటిక్ గాయ్ లా రవితేజ ఇందులో రెచ్చిపోవడం గమనార్హం. ఇక అనసూయ ఫుల్ హోమ్లీ మహిళ పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో ఆమె రోల్ ఏంటన్నది మాత్రం రివీల్ చేయలేదు.  ఇండియన్ ప్లేయర్ లా ఒకే టీంకు ఆడడం కన్నా ఎవరు డబ్బు ఎక్కువిస్తే వారికే ఆడే ‘ఐపీఎల్ ’ప్లేయర్ అంటూ మొదట్లోనే తనకు డబ్బే ముఖ్యమని చాటిచెప్పారు.

ఈ ఖిలాడీ మూవీలో అర్జున్ విలన్ గా నటించారు. విలన్ల నుంచి కోట్ల డబ్బు గల్లంతు చేసి వాటిని దాచేసి ఆడుకునే హీరోగా కథ సాగుతున్నట్టు తెలుస్తోంది. ఆ డబ్బు చుట్టూనే ట్రైలర్ మొత్తం నడించింది. విలన్లు, హీరో రవితేజ వాటి కోసం చేసే యాక్షన్, ఫైట్స్ అన్నీ కొత్తగా చూపించారు.

కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే ‘వీర’ చిత్రంతో రమేశ్ వర్మ-రవితేజ ఒక ఫ్లాప్ నిచ్చారు. ఇప్పుడు ‘ఖిలాడీ’తో ఎలాంటి సినిమా ఇస్తారన్నది వేచిచూడాలి. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ యాక్షన్, రోమాంటిక్ మూవీ అని తెలుస్తోంది.