Waltair Veerayya- Ravi Teja Teaser: తెలంగాణలో పుట్టినోళ్లకు ఇక్కడ యాస, భాష ఈజీగా వస్తుంది. ఇక కొందరు హీరోలు ఇక్కడి వారు కాకున్నా బాగానే తెలంగాణ యాస మాట్లాడుతారు.. నేర్చుకుంటారు.. ఉదాహరణకు కోటా శ్రీనివాసరావు, తనికెళ్లభరణి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నవీన్ పొలిశెట్టి లాంటి వారు తెలంగాణ యాసను బాగానే పలుకుతారు. కానీ తొలిసారి మాస్ మహారాజ రవితేజ తెలంగాణ యాసను ట్రై చేశారు. తన ఆంధ్రా మూలాలు అడ్డొచ్చాయి. ఆయన తెలంగాణ భాషను సరిగ్గా పలకలేకపోయారు. చిరంజీవి లీడ్ రోల్ లో‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో పవర్ ఫుల్ మాస్ తెలంగాణ క్యారెక్టర్ చేస్తున్న రవితేజ డైలాగుల్లో మాత్రం ఆ స్థాయి చూపించలేకపోయాడు.

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా మాస్ మహారాజ రవితేజ కూడా నటించాడు..స్టార్ హీరో అయ్యాక రవితేజ మెగాస్టార్ తో కలిసి నటించడం ఇదే తొలిసారి..అప్పట్లో వీళ్లిద్దరూ కలిసి ‘అన్నయ్య’ అనే సినిమా లో నటించారు..అది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్..ఈ సినిమా కూడా అలాగే బంపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
అందుకు తగ్గట్టుగానే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన కంటెంట్ ఉంది.. మెగాస్టార్ చిరంజీవి టీజర్ , బాస్ పార్టీ సాంగ్ తో మార్కెట్ లో విపరీతమైన బజ్ ని ఏర్పర్చుకున్న ఈ సినిమా నుంచి ఈరోజు విడుదలైన రవితేజ టీజర్ తో ఆ బజ్ ని వేరే స్థాయికి తీసుకెళ్లింది..చూస్తూ ఉంటే రవితేజకి ‘విక్రమార్కుడు’ సినిమా తర్వాత అంతటి పవర్ ఫుల్ పాత్ర ఈ సినిమా ద్వారా పడినట్టు అనిపిస్తుంది.
ఈ సినిమాకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ బాబీ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన హీరో రవితేజనే..అందుకే తన హీరోని ఇంత అద్భుతంగా ప్రెజెంట్ చేసాడు..’ఏమి రా వారి పిసా పిసా చేస్తున్నావ్..నీకింకా సమజ్ కాలే నేను ఎవని అయ్యకి వినను అనీ’ అంటూ రవితేజ చెప్పిన తెలంగాణ డైలాగ్ ప్రాస బాగాలేకున్నా బాగా పేలింది..టీజర్ లో రవితేజ కి ఇచ్చిన ఎలివేషన్స్, అతను చూపించిన మాస్ స్వాగ్, ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి పూనకాలు రప్పించే విధంగా ఉంది..మూవీ టీం ప్రతీ సారి ఈ సంక్రాంతికి ‘పూనకాలు లోడింగ్’ అంటూ ట్వీట్స్ వేసేవారు.

ఈ టీజర్ చూసాక ఫ్యాన్స్ కి పూనకాలు కాదు.. అంత మించి ఉండేట్టు ఉంది..సినిమా ప్రథమార్థం మొత్తం రవితేజ – చిరంజీవి మధ్య క్లాష్ ఉంటుందట..తర్వాత కలిసిపోతారు..వీళ్లిద్దరి మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలకు థియేటర్స్ దద్దరిల్లిపోవడం గ్యారంటీ అంటున్నారు…ఇలాగే ఉంటే సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి..చూడాలి మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతోంది అనేది.