https://oktelugu.com/

Waltair Veerayya Pre Release : ‘ఎంత మంది పోటీకి వచ్చినా ఈ సంక్రాంతి అన్నయ్యదే’ అంటూ అదిరిపోయే స్పీచ్ ఇచ్చిన రవితేజ

Waltair Veerayya Pre Release : మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు వైజాగ్ లోని ఆంధ్ర యూనివర్సిటీలో అంగరంగ వైభవంగా జరిగింది..నిన్న ట్రైలర్ ఇచ్చిన కిక్ తో మంచి ఊపుమీదున్న అభిమానులు, నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూనకాలు వచ్చి ఊగిపోయారు.. సభా ప్రాంగణం మొత్తం అభిమానుల కేరింతలు మరియు చప్పట్లతో హోరెత్తిపోయింది.. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మాస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 9, 2023 / 12:03 AM IST
    Follow us on

    Waltair Veerayya Pre Release : మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు వైజాగ్ లోని ఆంధ్ర యూనివర్సిటీలో అంగరంగ వైభవంగా జరిగింది..నిన్న ట్రైలర్ ఇచ్చిన కిక్ తో మంచి ఊపుమీదున్న అభిమానులు, నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూనకాలు వచ్చి ఊగిపోయారు.. సభా ప్రాంగణం మొత్తం అభిమానుల కేరింతలు మరియు చప్పట్లతో హోరెత్తిపోయింది..

    ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటించిన సంగతి తెలిసిందే.. ఈరోజు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన కూడా పాల్గొన్నాడు.. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. తాను ఒక స్టార్ అనే విషయాన్నీ పూర్తిగా పక్కన పెట్టి ఒక మెగాస్టార్ అభిమానిగా మాట్లాడిన మాటలు ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా చేసింది.

    ప్రిరిలీజ్ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ ‘ఇదే వైజాగ్ లో విజేత సినిమా కి సంబంధించిన విజయోత్సవ సభ జరిగింది..నేను ఆ సభలో వేలాది మంది అభిమానుల మధ్య ఒకడిగా వచ్చాను.. చిరంజీవి గారు , భానుప్రియ గారు అందరూ కూర్చొని ఉన్నారు.. అక్కడకి వచ్చిన అభిమానుల కేరింతలు చప్పట్లు చూసి నాతో పాటు వచ్చిన స్నేహితులు ఎంతో థ్రిల్ కి గురి అయ్యారు.. అప్పుడు నేను వాళ్ళతో చెప్పాను.. ఏదో ఒక రోజు మెగాస్టార్ పక్కన నేను కూర్చుంటాను అని..అలా అన్నయ్య సినిమాలో చిన్న క్యారక్టర్ ఆర్టిస్టుగా చేశాను..ఆ తర్వాత తమ్ముడిగా చేశాను.. ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో ఆయనతో మళ్ళీ కలిసి చేశాను.. ఈ 9 ఏళ్ళు అన్నయ్యని బాగా మిస్ అయ్యాను.. ఆయనలో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే ఒకరి గురించి తప్పుగా మాట్లాడడం ఇప్పటి వరకు నేను వినలేదు.. ఎంత బాధ పడిన తనలోనే దాచుకుంటాడు కానీ బయటపడడు.. ఆయనతో చాలా కాలం తర్వాత వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ డేస్ లో గడిపిన సందర్భాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను’ అంటూ రవితేజ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

    ఇంకా రవితేజ మాట్లాడుతూ ‘ఈ సినిమా మీద మీరు ఎన్ని అంచనాలు అయినా పెట్టుకోండి..ఆ అంచనాలను మించే ఈ సినిమా ఉంటుంది..ఈ సంక్రాంతి అన్నయ్యదే..ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బాబీ కూడా మరో స్థాయికి వెళ్లబోతున్నాడు’ అంటూ రవితేజ అభిమానుల్లో జోష్ నింపేవిధంగా అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు.