Ravanasura Twitter Talk: వరుస విజయాలతో జోరుమీదున్నాడు రవితేజ. ఆయన గత రెండు చిత్రాలు ధమాకా, వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ కొట్టాయి. చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజ కీలకమైన గెస్ట్ రోల్ చేశారు. పోలీస్ ఆఫీసర్ రోల్ లో తన మార్క్ ఎనర్జీ కనబరిచాడు. చిత్ర విజయంలో భాగమయ్యాడు. ఈ క్రమంలో రావణాసుర చిత్రం మీద సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. రావణాసుర ట్రైలర్ ఆకట్టుకోగా పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ రావణాసుర విడుదల చేశారు.
తెల్లవారుఝాము నుంచి యూఎస్ ప్రీమియర్స్ ప్రదర్శన మొదలైంది. సినిమా చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం పంచుకుంటున్నారు. రావణాసుర మూవీకి మెజారిటీ ఆడియన్స్ నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. బలమైన కథనం లేని రొటీన్ డ్రామా అన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. రావణాసుర మొదటి అరగంట స్లోగా ఎలాంటి ఆసక్తి లేకుండా సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా సాగిందంటున్నారు.
సెకండ్ హాఫ్ సైతం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. సిల్లీ ట్విస్ట్స్, ఆకట్టుకోని సన్నివేశాలు, ఆసక్తి రేపని స్క్రీన్ ప్లే సినిమాను నిరాశాజనకంగా మార్చాయి. రావణాసుర పతాక సన్నివేశాలు సైతం నిరాశపరిచాయని అంటున్నారు. సుధీర్ వర్మ ఎప్పటిలాగే అసంపూర్తి వంటకంగా రావణాసుర చిత్రాన్ని తెరకెక్కించి విడుదల చేశారంటున్నారు. అయితే అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు అలరిస్తాయని నెటిజెన్స్ అభిప్రాయం.
రావణాసుర మూవీలో పాజిటివ్ అంశంగా రవితేజ పెర్ఫార్మన్స్ చెబుతున్నారు. నెగిటివ్ షేడ్ రోల్ లో ఆయన పూర్తి స్థాయిలో మెప్పించారని అంటున్నారు. పాత్రకు తగ్గట్లు ఆయన మేనరిజం, డైలాగ్ డెలివరీ మెప్పించాయి. రవితేజ ఫ్యాన్స్ కిక్ ఫీలయ్యే సన్నివేశాలు కొన్ని ఉన్నాయని అంటున్నారు. భీమ్స్ సిసిరోలియో పాటలు నిరాశపరచినా బీజీఎమ్ మాత్రం అద్భుతం అనేది నెటిజెన్స్ అభిప్రాయం.
ఒకరికి నలుగురున్న హీరోయిన్స్ పాత్రలు అంతంత మాత్రమే. ట్విట్టర్ టాక్ ప్రకారం మూవీ యావరేజ్. అయితే రవితేజ ఫ్యాన్స్ సినిమా సూపర్ హిట్ అంటున్నారు. హ్యాట్రిక్ కొట్టేశామని ట్వీట్స్ వేస్తున్నారు. పూర్తి స్థాయి రివ్యూ వస్తే కానీ ఒక అభిప్రాయానికి రాగలం. ఓపెనింగ్ డే కలెక్షన్స్, ఫస్ట్ వీక్ రిపోర్ట్ తో రావణాసుర ఫలితం మీద క్లారిటీ వచ్చేస్తుంది.
#Ravanasura Overall A Strictly Below Par Crime/Psychological Thriller!
The storyline is interesting with a few decent sequences and Ravi Teja does well in a negative type role, but the rest is a let-down with lousy screenplay and many scenes that leave no impact
Rating: 2.25/5
— Venky Reviews (@venkyreviews) April 7, 2023
First 45 min of the second half was good with the investigation scenes but it becomes routine at the end. Last 20-25 min is crap. Overall an average film. You may watch it for the attempt #Ravanasura
— sharat (@sherry1111111) April 7, 2023
https://twitter.com/sk_kiran16/status/1644155192571580422
https://twitter.com/Chowdary____/status/1644159175126073346
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Ravi teja ravanasura movie twitter talk
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com