నటీనటులు : రవితేజ, సుశాంత్, మేఘ ఆకాష్, అను ఇమ్మానుయేల్ , దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ, ఫైరా అబ్దుల్లా, జయరాం, సంపత్ రాజ్, రావు రమేష్, మురళి శర్మ, హైపర్ ఆది, సత్య తదితరులు.
డైరెక్టర్ : సుధీర్ వర్మ
సంగీతం : హర్ష వర్ధన్ రామేశ్వర్, భీమ్స్
నిర్మాతలు : రవితేజ , అభిషేక్ నామ
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ధమాకా మరియు వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్ సినిమాలతో మనషి ఊపు మీదున్నాడు.కెరీర్ లో చాలా కాలం తర్వాత పీక్ స్థాయి ని ఎంజాయ్ చేస్తున్నాడు.ఆయన అభిమానులు కూడా మునుపెన్నడూ లేని ఉత్సాహం తో ఉరకలు వేస్తున్నారు.అలాంటి ఉత్సాహం లో ఉన్నప్పుడు విడుదలైన సినిమానే ‘రావణాసుర’.టీజర్ మరియు ట్రైలర్ తో మంచి అంచనాలను కలగచేసిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదులైంది.మరి ఈ సినిమా రవితేజ కి హ్యాట్రిక్ హిట్ ఇచ్చిందా..?లేదా నిరాశపర్చిందా.? అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము.
కథ :
రవితేజ ఫైరా అబ్దుల్లా అనే సీనియర్ లాయర్ దగ్గర జూనియర్ గా పనిచేస్తూ ఉంటాడు.మరో హీరోయిన్ మేఘా ఆకాష్ తన తండ్రి సంపత్ రాజ్ మీద పడిన మర్డర్ కేసు అభియోగం పై విచారణ జరిపి అసలు నిజం తెలుసుకొని తన తండ్రిని విడిపించేందుకు రవితేజ మరియు ఫైరా అబ్దుల్లా ని సంప్రదిస్తుంది.ఆ తర్వాత అలాంటి మర్డర్స్ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి.ఇలా వరుసగా మర్డర్స్ చేస్తున్నది రవితేజ నే అని తర్వాత తెలుస్తుంది.అసలు ఎందుకు ఆయన మర్డర్స్ చేస్తున్నాడు, కారణం ఏమిటి..?, అంత నెగటివ్ గా ఎందుకు మారాడు అనేదే మిగిలిన స్టోరీ.
విశ్లేషణ :
సినిమా ప్రారంభం ఎంటర్టైన్మెంట్ తోనే లాగేసాడు డైరెక్టర్ సుధీర్ వర్మ, కానీ ఆ తర్వాత మర్డర్ సన్నివేశాలను చాలా ఆసక్తికరంగా ఉండేట్టు చిత్రీకరించాడు.ఆడియన్స్ లో తర్వాత ఏమి జరగబోతుంది అనే ఆత్రుతని కలిగించేలా చేసాడు.ప్రీ ఇంటర్వెల్ మరియు ఇంటర్వెల్ సన్నివేశాలు ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది.అంత వరకు ఎంటర్టైన్మెంట్ జానర్ లో కొనసాగిన ఈ చిత్రం, ఒక్కసారిగా థ్రిల్లర్ జానర్ లోకి వెళ్ళిపోతుంది.రవితేజ ఈ చిత్రం లో నెగటివ్ షేడ్స్ లో అల్లాడించేసాడు అనే చెప్పాలి.ఆయనని చూసే ప్రతీ ఒక్కరికి ఒక కొత్త అనుభూతి కలుగుతుంది.ఇలాంటి పాత్ర ఆయన ఇంతకు ముందు ఎప్పుడూ చెయ్యలేదు, ఇక హీరోయిన్స్ గా నటించిన ఫైరా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్ మరియు పూజిత పొన్నాడ తమ పరిధిమేర బాగానే నటించారు.
ఇక యువ హీరో సుశాంత్ కి చాలా కాలం తర్వాత ఒక మంచి పాత్ర దక్కింది అనే చెప్పాలి,ఇందులో ఆయనని చాలా కొత్తగా చూపించాడు డైరెక్టర్ సుధీర్ వర్మ.సంపత్ రాజ్, మరియు జయరాం వంటి నటీనటుల నటన కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిల్చింది.ముఖ్యంగా జయరాం మరియు రవితేజ మధ్య సాగే పోలీస్ దొంగ ఆట ప్రేక్షకులను ఆసక్తిగా సీట్స్ లో కూర్చొని చూసేలా చేస్తుంది.మొత్తానికి ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుధీర్ వర్మ రవితేజ మార్కు తో ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఒక డీసెంట్ థ్రిల్లింగ్ అనుభూతిని అందించడం లో సక్సెస్ అయ్యాడు.కానీ ఈ చిత్రానికి A సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు.బాక్స్ ఆఫీస్ మీద దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది.ఈ పెద్ద సవాలు ని దాటి ‘రావణాసుర’ సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది చూడాలి.
చివరి మాట : రెండు భారీ విజయాల తర్వాత రవితేజ నుండి వచ్చిన మరో డీసెంట్ మూవీ రావణాసుర.ఈ వీకెండ్ కి మంచి టైం పాస్ అయ్యే మూవీ అని చెప్పొచ్చు, చూసి ఎంజాయ్ చెయ్యండి.
రేటింగ్ : 2.50 /5