https://oktelugu.com/

Ramarao On Duty Teaser : రామారావ్ ఆన్ డ్యూటీ: నేరస్తుల తాట తీస్తున్న రవితేజ

Ramarao On Duty Teaser : రామారావ్ ఆన్ డ్యూటీలో ఉంటే నేరస్థుల గుండెల్లో గుబులే. ఇప్పటికే ‘క్రాక్’తో ప్రేక్షకులకు కిరాక్ పుట్టించిన రవితేజ.. ఇప్పుడు ‘రామారావు’గా వస్తున్నారు. సరికొత్త కథలు, కథాంశంలో అలరిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ టీజర్ విడుదలైంది. మహా శివరాత్రి శుభాకాంక్షలతో మేకర్స్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. రవితేజ ఇంటెన్స్ యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్ లతో టీజర్ ప్రేక్షకుల్లో అటెన్షన్ ను క్రియేట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 1, 2022 / 05:27 PM IST
    Follow us on

    Ramarao On Duty Teaser : రామారావ్ ఆన్ డ్యూటీలో ఉంటే నేరస్థుల గుండెల్లో గుబులే. ఇప్పటికే ‘క్రాక్’తో ప్రేక్షకులకు కిరాక్ పుట్టించిన రవితేజ.. ఇప్పుడు ‘రామారావు’గా వస్తున్నారు. సరికొత్త కథలు, కథాంశంలో అలరిస్తున్నారు.

    Ramarao On Duty Teaser

    మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ టీజర్ విడుదలైంది. మహా శివరాత్రి శుభాకాంక్షలతో మేకర్స్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. రవితేజ ఇంటెన్స్ యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్ లతో టీజర్ ప్రేక్షకుల్లో అటెన్షన్ ను క్రియేట్ చేసింది.

    Also Read:  ఆర్ఆర్ఆర్ నుంచి అభిమానులకు మరో సర్ ప్రైజ్.. రాంచరణ్, ఎన్టీఆర్ ఇలా.. వైరల్ ఫొటో

    ‘పేరు సింపుల్ గా ఉన్నా.. వాడు సూపర్ మ్యాన్’, ‘ఆయుధం మీద ఆధారపడే నీలాంటి వాడి ధైర్యం వాడే ఆయుధంపై ఉంటుంది.. ఆయుధంలా బతికే నాలాంటి వాడి ధైర్యం అణువణువునా ఉంటుంది’ వంటి పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఆకట్టుకునేలా రవితేజ ఇందులో కనిపించారు.

    రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ‘రవితేజ’ డిప్యూటీ కలెక్టర్ పాత్రలో కనిపించనున్నారు. నిజాయితీగా.. నిబద్దత కలిగిన అధికారిగా.. పేదల పక్షాన నిలిచే అధికారిగా రవితేజ కనిపించనున్నట్లు టీజర్ ను చూస్తే అర్తమవుతోంది.

    చాలా కాలం తర్వాత హీరో తొట్టంపూడి వేణు ఈ సినిమాలో కనిపించడం విశేషం. సినిమాలో నరేశ్ సైతం కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

    టీజర్ లో రవితేజ ఎనర్జీ చూస్తుంటే మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అన్నట్టుగా కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత వేణు కూడా మళ్లీ తెరపై కనిపించడంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు.

    Also Read: పూరి జగన్నాథ్ భార్యకి చిరంజీవి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా?

    ఎస్ ఎల్వీ సినిమాస్-ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 25నే రామారావు ఆన్ డ్యూటీ విడుదల కావాల్సి ఉంది. కానీ అదే రోజు ‘ఆర్ఆర్ఆర్’ డేట్ ఫిక్స్ కావడంతో ఏప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్ణయించారు.