https://oktelugu.com/

Ravi Teja Dhamaka Trailer : కోట్లలో ఒకడు, కొడితే కోలుకోలేవు… రవితేజ మార్క్ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా ధమాకా!

Ravi Teja Dhamaka  Trailer Talk : క్రాక్ తో బంపర్ హిట్ అందుకున్న రవితేజ రెండు వరుస ప్లాప్స్ చూశారు. ఆయన నటించిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు పరాజయం పొందాయి. దీంతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. త్రినాథ రావ్ నక్కిన డైరెక్షన్ లో ‘ధమాకా’ అంటూ తన మార్క్ మాస్ మసాలా ఎంటర్టైనర్ చేస్తున్నారు. డిసెంబర్ 23న ధమాకా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కానుంది. విడుదలకు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 15, 2022 / 07:39 PM IST
    Follow us on

    Ravi Teja Dhamaka  Trailer Talk : క్రాక్ తో బంపర్ హిట్ అందుకున్న రవితేజ రెండు వరుస ప్లాప్స్ చూశారు. ఆయన నటించిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు పరాజయం పొందాయి. దీంతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. త్రినాథ రావ్ నక్కిన డైరెక్షన్ లో ‘ధమాకా’ అంటూ తన మార్క్ మాస్ మసాలా ఎంటర్టైనర్ చేస్తున్నారు. డిసెంబర్ 23న ధమాకా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గరపడుతుండగా ప్రమోషన్స్ షురూ చేశారు. దీనిలో భాగంగా నేడు ధమాకా ట్రైలర్ విడుదల చేశారు.

    రెండు నిమిషాల ధమాకా ట్రైలర్ ఎక్కడా తగ్గలేదు. యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ జోడించి ఫుల్ మీల్ సిద్ధం చేశారు. రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. ఆయన క్లాస్, మాస్ ఇలా రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న రోల్స్ చేస్తున్నారు. ఇక మాస్ డైలాగ్స్ కి కొదవలేదని తెలుస్తుంది. ‘వాడు కోటిలో ఒకడు. కొడితే కోలుకోలేరు’ అని తనికెళ్ళ భరణి ఇస్తున్న ఎలివేషన్ గూస్ బంప్స్ తెప్పించింది. యంగ్ బ్యూటీ శ్రీలీల గ్లామర్, భీమ్స్ సిసిరోలే మ్యూజిక్ ట్రైలర్ కి ఆకర్షణగా నిలిచాయి.

    ధమాకా చిత్రంపై పాజిటివ్ బజ్ నడుస్తుంది. ట్రైలర్ చూశాక అంచనాలు మరింతగా పెరిగాయి. ధమాకాతో రవితేజ పక్కా హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. అభిమానులు కోరుకునే మాస్ అంశాలు కావాల్సిన పాళ్లలో జోడించి దర్శకుడు ధమాకా రూపొందించారు. నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. భారీ క్యాస్ట్ ఈ మూవీలో నటించారు. తనికెళ్ళ భరణి, జయరాం, సచిన్ ఖేడేకర్, రావు రమేష్, అలీ వంటి సీనియర్ నటులు ధమాకా చిత్రంలో భాగమయ్యారు.

    పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇక 2022 చివర్లో రవితేజ టాలీవుడ్ కి గొప్ప ఎండింగ్ ఇస్తాడనిపిస్తుంది. కాగా ధమాకా విడుదలైన రోజుల వ్యవధిలో రవితేజ మరో చిత్రంతో సందడి చేయనున్నారు. చిరంజీవి లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య చిత్రంలో రవితేజ నటిస్తున్న విషయం తెలిసిందే. ఏసీపీ విక్రమ్ సాగర్ రోల్ ఆయన చేస్తున్నారు. ఆయన ఫస్ట్ లుక్ వీడియో కేక పుట్టించింది. జనవరి 13న వాల్తేరు వీరయ్య విడుదల కానుంది.