https://oktelugu.com/

Ratan TATA Dog: రతన్ టాటా పెంపుడు కుక్క మరణించిందా? అసలేం జరిగింది?

రతన్ టాటాకు కుటుంబ సభ్యులు తక్కువే ఉన్నారు. కానీ ఆయన జీవితంలో ఎంతో మందికి దగ్గరయ్యారు. వ్యాపార రంగంలో మాత్రమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలను పొందారు.

Written By:
  • Srinivas
  • , Updated On : October 16, 2024 1:20 pm
    Ratan TATA Dog

    Ratan TATA Dog

    Follow us on

    Ratan TATA Dog: భారతదేశ వ్యాపార దిగ్గజం రతన్ టాటా అక్టోబర్ 9న ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. రతన్ టాటా మరణ వార్తపై కేవలం వ్యాపారులు మాత్రమే కాకుండా ఆయన అభిమానులు, దేశ ప్రజలు తీవ్ర శోకంలో మునిగి వెళ్లారు. మిగతా వ్యాపారుల కంటే భిన్నంగా ఉండడమే కాకుండా ఎందరో దేశ ప్రజల ఆప్యాయతను పంచుకున్న ఆయన మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రతన్ టాటా లాంటి వ్యక్తిని మళ్లీ చూడలేమని ఇప్పటికీ కొందరు కొనియాడుతున్నారు. అయితే రతన్ టాటాకు మనుషులు మాత్రమే కాకుండా ఆయన ఎంతో ఇష్టపడిని శునకం కూడా ఆయన పార్థివ దేహాన్ని చూసి బాధపడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రతన్ టాటకు ఆయనతో సమానమైన వారు మాత్రమే కాకుండా తనకంటే చిన్న వయసు వారు స్నేహితులు, ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క ఉండేది. అయితే రతన్ టాటా మరణాన్ని తట్టుకోలేకపోయిన ఈ శునకం మరణించిందన్న వార్తలు ప్రచారం సాగుతున్నాయి. అయితే అసలు విషయం ఏంటంటే?

    రతన్ టాటాకు కుటుంబ సభ్యులు తక్కువే ఉన్నారు. కానీ ఆయన జీవితంలో ఎంతో మందికి దగ్గరయ్యారు. వ్యాపార రంగంలో మాత్రమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలను పొందారు. మధ్య తరగతి వారు సైతం కారులో ప్రయాణించాలని అనుకున్న ఆయన లక్ష రూపాలయకే ‘నానో’ కారు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇది అంతగా సక్సెస్ కాలేకపోయినా మరో కారును చాల తక్కువ ధరకే తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఇంతలోనే ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. ఇవే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. తనకు వచ్చే సంపాదనలో సగభాగం సేవా కార్యక్రమాలకే వెచ్చించేవారు.

    ఈ క్రమంలో ఆయనకు ఎంతో మంది ఆప్తులు తయారయ్యారు. వీటిలో తన పెంపుడు కుక్క కూడా ఒకటి ఉంది. దీని పేరు ‘గోవా’. రతన్ టాటా ఉన్న సమయాల్లో ఆయన దీనిని ఎంతో అపురూపంగా చూసుకునేవారు. తన కుటుంబ సభ్యుల్లో ఒకటిగా శునకం ఉండేది. అయితే రతన్ టాటా మరణ వార్త తెలుసుకున్న తరువాత గోవా తీవ్రంగా బాధపడింది. ఆయన పార్థివ దేహం వద్ద కాసేపు ఉన్నది. అయితే రతన్ టాటా మరణ వార్త తెలుసుకున్న తరువాత గోవా కూడా మరణించిందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై ముంబై పోలీసులు స్పందించారు.

    రతన్ టాటా పెంపుడు కుక్క‘గోవా’ మరణించలేదని తెలిపారు. గోవా బతికే ఉన్నట్లు బాంబే హౌస్ లోని ఉన్నట్లు రతన్ టాటా మిత్రుడు శంతను నాయుడు చెప్పినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ప్రస్తుతం రతన్ టాటా పెంపుడు కుక్క బాంబే హస్ లోనే ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా గోవా చనిపోయినట్లు వార్తలు ప్రచారం చేయొద్దని తెలిపారు. అంతకుముందు రతన్ టాటా గోవా పర్యటనకు వెళ్లినప్పుడు ఓ కుక్క పిల్ల తన వెంట వచ్చింది. దీంతో తన దగ్గరికి వెళ్లగా అది ఎంతో ప్రేమతో రతన్ టాటా వద్దకు వచ్చింది. దీంతో ఆయన దానిని ముంబైకి తీసుకువచ్చారు. అయితే ఇది గోవాలో దొరికింది కాబట్టి.. దీనికి గోవా అని పేరు పెట్టారు.