
Rashmika Mandanna: రష్మిక మందాన అటు నార్త్ ఇటు సౌత్ ని బ్యాలన్స్ చేస్తూ… జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఈ నేషనల్ క్రష్ చేస్తున్నవన్నీ భారీ చిత్రాలే. గత ఏడాది రష్మీకకు మిక్స్డ్ ఫలితాలు దక్కాయి. ఆమె నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు ప్లాప్ అయ్యింది. సీతారామం బ్లాక్ బస్టర్ కొట్టింది. అయితే క్రెడిట్ మొత్తం మృణాల్ కొట్టేసింది. హిందీ చిత్రం గుడ్ బై భారీ ఝలక్ ఇచ్చింది. అమితాబ్ నటించినా కూడా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పట్టించుకోలేదు.

ఇక లేటెస్ట్ రిలీజ్ వారసుడు యావరేజ్ గా నిలిచింది. విజయ్ హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన వారసుడు మూవీలో రష్మిక పాత్రకు కనీస ప్రాధాన్యత లేదు. అదే విషయాన్ని రష్మికను అడిగితే అన్నీ తెలిసే చేశాను అంటూ సమర్థించుకుంది. కేవలం విజయ్ కోసం వారసుడు చేశాను. నా పాత్ర నామమాత్రం అని విజయ్, నేను సెట్స్ చెప్పుకునేవాళ్లమని ఆమె అన్నారు. అయితే 2023 ప్రారంభంలోనే అమ్మడు కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రకటించింది.

నితిన్ కి జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక ఒక చిత్రం ప్రకటించారు. భీష్మ చిత్రం అనంతరం మరోసారి నితిన్-రష్మిక జతకడుతున్నారు. ఇక దర్శకుడు వెంకీ కుడుములతో హ్యాట్రిక్ మూవీ. రష్మికను టాలీవుడ్ కి పరిచయం చేసింది వెంకీ కుడుములనే. ఆయన గత రెండు చిత్రాలు ఛలో, భీష్మలో రష్మిక నటించారు. ముచ్చటగా మూడో చిత్రానికి ఆమెనే కొనసాగిస్తున్నారు. అలాగే రైన్ బో టైటిల్ తో ఓ మల్టీ లాంగ్వేజ్ మూవీ ప్రకటించారు.
రైన్ బో మూవీ లవ్ అండ్ ఫాంటసీ జోనర్లో తెరకెక్కుతుందట. రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతుండగా మోహన్ దేవ్ కీలక రోల్ చేస్తున్నారు. ఇక రష్మిక చేస్తున్న మేజర్ ప్రాజెక్ట్స్ పుష్ప 2, యానిమల్. సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన ‘వేర్ ఈజ్ పుష్ప?’ కాన్సెప్ట్ టీజర్ ఆకట్టుకుంది. పుష్ప 2 వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుందట. ఇక అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న యానిమల్ మూవీలో రన్బీర్ కపూర్ కి జంటగా నటిస్తుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా రష్మిక జోరు చూపిస్తున్నారు.

తాజాగా ఓ అమెరికన్ మ్యాగజైన్ కోసం గ్లామరస్ ఫోటో షూట్ చేశారు. కోటులో హాటుగా దర్శన మిచ్చారు. హార్పర్స్ బజార్ మ్యాగజైన్ షూట్ లో రష్మిక టెంప్ట్ చేశారు. ఆమె లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.