Vijay Deverakonda- Rashmika Mandanna: సెలబ్రిటీల ప్రేమ కథలు కొంచెం వింతగా ఉంటాయి. కొందరు ఓపెన్ గా తమ ఎఫైర్స్ గురించి చెప్పేస్తారు. మరికొందరు చెప్పకున్నా సన్నిహితంగా ఉంటూ హింట్ ఇస్తారు. కొన్ని జంటలు మాత్రం రిలేషన్ లో ఉండి కూడా బుకాయిస్తూ ఉంటారు. అబ్బే అదేం లేదని తప్పుదోవపట్టిస్తారు. ఈ కోవలోకే వస్తారు విజయ్ దేవరకొండ-రష్మిక మందాన. వీరిద్దరూ ఎఫైర్ లో ఉన్నారని గత రెండేళ్లుగా వినిపిస్తుంది. ముంబైలో తరచుగా కలవడం, డిన్నర్ నైట్స్ కి వెళ్లడం చేస్తున్నారు. దీంతో బాలీవుడ్ మీడియా వీరి ఎఫైర్ గురించి ప్రముఖంగా రాసింది. అయితే ప్రతిసారి ఖండిస్తూ వస్తున్నారు. మేము స్నేహితులం మాత్రమే అని మభ్య పెడుతున్నారు.

రెండుసార్లు కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. ఇద్దరూ ఒకే గదిలో స్టే చేసినట్లు కూడా ఆధారాలు లభించాయి. సెకండ్ ట్రిప్ లో రష్మిక హోటల్ గది నుండి ఫ్యాన్స్ తో ఆన్లైన్ చాట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో బ్యాక్ గ్రౌండ్ లో విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించింది. దాంతో కలిసే వెకేషన్ కి వెళ్లారు. ఒకే గదిలో ఉంటూ జంటగా ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారన్న క్లారిటీ వచ్చేసింది.
ఈ విషయంపై రష్మిక ఓపెన్ అయ్యింది. విజయ్ తో మీరు మాల్దీవ్స్ వెళ్లిమాట నిజమే కదా? అని ప్రశ్నిస్తే… అవును వెళ్ళాను. అందులో తప్పేముంది. మేమిద్దరం స్నేహితులం. కలిసి విహారానికి వెళ్లడం జరిగిందని కుండబద్దలు కొట్టింది. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం ఒక అమ్మాయి, అబ్బాయి ఏకాంతంగా రొమాంటిక్ ప్లేస్ కి వెళ్లడం, ఒకే గదిలో ఉండటం చేస్తారా? అని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ ప్రేమికులు మాత్రమే చేసే పనులు, లవర్స్ చేయరు అంటున్నారు.

విజయ్ దేవరకొండతో కలిసి వెకేషన్ కి వెళ్లానని ఒప్పుకున్న రష్మిక… ఒకే గదిలో ఉన్నట్లు కూడా ఒప్పుకున్నట్లు అయ్యింది. ఒకరికపై మరొకరికి ప్రేమ ఉన్నప్పుడు ఈ దాపరికాలు ఎందుకు? ఓపెన్ గానే లవ్ చేసుకోవచ్చుగా! అని నెటిజెన్స్ ప్రశ్న. కాగా గతంలో రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించారు. ఆయనతో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. వివాహం చేసుకుంటే కెరీర్ ముగిసినట్లే అనుకున్న రష్మిక మనసు మార్చుకొని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ కారణంగా ఈమె రక్షిత్ శెట్టి ఆగ్రహానికి కారణమైంది.