
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందాన అనతికాలంలో ఎదిగారు. టాలీవుడ్ లో అడుగుపెట్టాక ఈ కన్నడ భామ ఫేట్ మారిపోయింది. వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది. ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి విజయాలు ఆమెను టాప్ హీరోయిన్ చేశాయి. ఇక పుష్ప మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో మోత మోగించారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. రష్మిక మందాన కెరీర్లో పుష్ప అతిపెద్ద విజయంగా ఉంది.
ప్రస్తుతం రష్మిక పుష్ప 2, యానిమల్, నితిన్ చిత్రాల్లో నటిస్తున్నారు. పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పుష్ప 2 మూడు వందలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా శ్రీవల్లి పాత్రలో మరోసారి మెప్పిచనుంది. ఇక బాలీవుడ్ లో భారీ హిట్ కొట్టాలన్న ఆమె కల యానిమల్ తీర్చే సూచనలు కలవు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా యానిమల్ చిత్రానికి దర్శకుడు. రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా నితిన్ తో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు.
రష్మికతో ఛలో, భీష్మ చిత్రాలు తెరకెక్కించిన వెంకీ కుడుముల దర్శకుడు. చెప్పాలంటే రష్మిక కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. తాజాగా ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన వ్యక్తిగత జీవితం గురించి వెల్లడించారు. రష్మిక మాట్లాడుతూ… నేను నిద్ర లేవగానే పెట్ డాగ్స్ తో ఆడుకుంటాను. అది నాకెంతో సంతోషాన్ని కలిగించే విషయం. ప్రతి విషయాన్ని డైరీలో రాసుకుంటాను. ఇంటికి రాగానే పేరెంట్స్ పాదాలు మొక్కుతాను. అమ్మానాన్నలవే కాదు చివరికి పనివాళ్ళవి కూడా. వాళ్ళను వేరుగా చూడను. ఇంటి సభ్యుల వలెనే ట్రీట్ చేస్తాను.

నా పేరెంట్స్ నన్ను చూసి గర్వపడరు. చెప్పాలంటే వాళ్లకు నేను ఏం చేస్తున్నానో కూడా తెలియదు. చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటారు. నాకు ఏదైనా అవార్డు వస్తే మాత్రం పొంగిపోతారు. ఏ లోటు లేకుండా నన్ను పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు వాళ్ళను సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత నాది… అని రష్మిక చెప్పుకొచ్చారు. రష్మికకు చెల్లి కూడా ఉంది. ఆ పాప నాలుగో తరగతి చదువుతుంది. మరోవైపు రష్మిక మీద ఎఫైర్ రూమర్స్, సోషల్ మీడియా ట్రోల్స్ ఎక్కువయ్యాయి.