Rashmika Mandanna Tattoo: హీరోయిన్స్ కి టాటూల పిచ్చి ఉంటుంది. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోయిన్ ఒంటిపై టాటూలు ఉన్నాయి. కొందరైతే ప్రైవేట్ ఏరియాల్లో టాటూలు వేయించుకొని సంచలనం రేపారు. ఇక స్టార్ హీరోయిన్ రష్మిక మందాన శరీరం మీద కూడా ఓ టాటూ ఉంది. ఆమె కుడి చేయిపై అర్థం కాకుండా ఓ పదం ఉంది. ఆ ఇంగ్లీష్ గొలుసుకట్టు పదం ఏమిటో? ఆ పదం వెనకున్న ఆమె అభిప్రాయం ఏమిటో? అసలు ఎందుకు టాటూ వేయించుకోవాల్సి వచ్చిందో రష్మిక ఓ సందర్భంలో తెలిపారు.

కాలేజ్ డేస్ లో ఒక అబ్బాయి అమ్మాయిలను తక్కువ చేసి మాట్లాడాడట. అమ్మాయిలకు ధైర్యం ఉండదు. సూదులు, పదునైన వస్తువులు అంటే భయమని… ఎగతాళి చేశాడట. కాదని నిరూపించడం కోసం రష్మిక టాటూ వేయించుకోవాలని నిర్ణయించుకున్నారట. టాటూగా ఏం వేయించుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు ఆమెకు ఓ ఆలోచన తట్టిందట. ఈ ప్రపంచంలో ఎవరికి వారే ప్రత్యేకం. ఒకరిని మరొకరు భర్తీ చేయలేరు. కాబట్టి ఆ భావం వచ్చేలా ఇర్రిప్లేసబుల్ (Irreplaceable) అనే పదం టాటూగా వేయించుకున్నారట. తన ఒంటిపై ఉన్న టాటూ నేపథ్యం ఇదని రష్మిక తెలియజేశారు.
అయితే దీనికి మరో కథనం కూడా ఉంది. రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించారు. ఆమె ఫస్ట్ మూవీ కిరిక్ పార్టీ హీరో రక్షిత్ శెట్టినే కాగా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. రక్షిత్-రష్మిక అని అర్థం వచ్చేలా ఆర్ ఆర్(rr) అని ఆమె టాటూ వేయించుకున్నారట. అయితే ఎంగేజ్మెంట్ అనంతరం రక్షిత్ కి రష్మిక బ్రేకప్ చెప్పింది. దీంతో తన ఒంటిపై ఉన్న టాటూగా ఉన్న ఆర్ ఆర్ లెటర్స్ ని ఇర్రిప్లేసబుల్ అనే పదంగా మార్చేసిందట. మరి ఈ రెండు వాదనల్లో ఏది నిజం అనేది తెలియదు.

కాగా కన్నడ పరిశ్రమలతో రష్మిక వివాదాలు కొనసాగుతున్నాయి. రష్మిక ఎలాంటి గొడవలు లేవని చెబుతున్నా పరిస్థితులు చూస్తుంటే ఆమెపై రిషబ్ శెట్టితో పాటు పలువురు కన్నడ పరిశ్రమ పెద్దలు కోపంగా ఉన్నారని అర్థం అవుతుంది. ఇటీవల రిషబ్ శెట్టి తాను తెరకెక్కించిన కిరిక్ పార్టీ రిలీజ్ యానివర్సరీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. హీరో రక్షిత్ శెట్టితో పాటు చిత్ర యూనిట్ కి కృతఙ్ఞతలు తెలిపిన రిషబ్… రష్మిక పేరు మెన్షన్ చేయలేదు. ఇక రష్మిక కెరీర్ పీక్స్ లో ఉండగా కన్నడ పరిశ్రమ పట్టించుకోకున్నా పర్లేదు అన్నట్లు బిహేవ్ చేస్తుంది.