Senagapappu: మన ఆరోగ్యానికి శనగలు ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆహారంలో వీటిని చేర్చుకోవడం మంచిదే. కానీ గ్యాస్ సమస్యలు ఉన్న వారు తీసుకుంటే చప్పుడే చప్పుడు. జీర్ణం అయ్యే వరకు బాంబులే బాంబులు వస్తాయి. దీంతో ఇబ్బందిగా ఫీలవుతారు. ఎసిడిటి సమస్య ఉన్న వారు కూడా వీటిని తీసుకోవడం వల్ల అనర్థాలే వస్తాయి. శనగపప్పు తినవడం వల్ల మంచి బలం వచ్చినా కొన్ని సమస్యలు కూడా ఉండటంతో వీటిని మితంగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

శనగ పప్పు తినడం వల్ల పొట్ట నొప్పి ఉన్న వారు ఇబ్బందులకు గురవుతారు. అందుకే వీరు శనగపప్పును తినొద్దని హెచ్చరిస్తున్నారు. శనగ పప్పు లోపలకు వెళ్లిన తరువాత తొందరగా జీర్ణం కాదు. దీంతో పొట్టలో నొప్పిగా ఉంటుంది. దీని వల్ల కడుపునొప్పి కూడా ఏర్పడవచ్చు. అందుకేు శనగపప్పును దూరం చేసుకోవడమే ఉత్తమం. పోషకాలు మెండుగా ఉన్న పొట్టనొప్పి వస్తుందనే భయం పట్టుకుంటుంది. దీని వల్ల అజిర్తి సమస్య వెంటాడుతుంది. అందుకే శనగ పప్పును తినకుండా ఉండటమే శ్రేయస్కరం.
గర్భిణులు కూడా శనగ పప్పును అధికంగా తీసుకోకూడదు. కడుపుతో ఉన్న మహిళలు శనగపప్పుతో చేసిన వంటకాలు అధికంగా తింటే వారికి పొట్టలో నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. బాలింతలు కూడా ఎక్కువగా శనగపప్పు తినొద్దు. దీంతో తల్లి, బిడ్డకు కూడా గ్యాస్ సమస్యలు రావచ్చు. ఈ నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు శనగపప్పును మితంగానే తీసుకోవాలి. ఎక్కువైతే సమస్యలు తప్పవు. శనగపప్పుతో ఇన్నిరకాల ఇబ్బందులు ఉన్నందున వీటిని తక్కువ మొత్తంలో తీసుకోవడమే మంచిది.

ఇంకా కొందరిలో గ్యాస్, ఎసిడిటి సమస్యలు అధికంగా ఉన్నాయి. శనగపప్పును దూరం పెట్టడం వల్ల కూడా కొన్ని లాభాలున్నాయి. శనగపప్పుతో చేసిన వంటకాలు తింటే పొట్టలో గ్యాస్, ఎసిడిటి అధికమవుతుంది. రాత్రి సమయాల్లో శనగపప్పు తినడం వల్ల త్వరగా జీర్ణం కాక సమస్యలొస్తాయి. కడుపు గులగులగా ఉంటుంది. గుండెల్లో మంట, పుల్లటి తేన్పులు వస్తాయి. పొట్టలో గ్యాస్ ఉత్పత్తి ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో శనగపప్పును ఆహారంగా చేసుకోకపోవడమే ఉత్తమం.