https://oktelugu.com/

Rashmika Mandana : ప్యాంటు లేకుండా పబ్లిక్ లో తిరిగేస్తున్న రష్మిక… నీకు గుడ్ బై మేము చూడమంటూ ట్రోల్స్

Rashmika Mandana Instagram hot photos : హీరోయిన్ రష్మిక మందాన కన్నడ పరిశ్రమ నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది. ఆమె చర్యలను, కామెంట్స్ ని తప్పుబడుతున్న కన్నడ ఆడియన్స్ ట్రోల్ చేస్తున్నారు.కాగా కన్నడ పరిశ్రమ పెద్దలు, థియేటర్స్ యాజమాన్యాలు రష్మికను బ్యాన్ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కెరీర్ బిగినింగ్ నుండి రష్మికపై సొంత ఇండస్ట్రీలో వ్యతిరేకత ఉంది. ఆమె ఫస్ట్ మూవీ కిరాక్ పార్టీ కాగా రక్షిత్ శెట్టి హీరో. ఆయనతో రష్మిక ప్రేమలో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 4, 2022 / 10:18 AM IST
    Follow us on

    Rashmika Mandana Instagram hot photos : హీరోయిన్ రష్మిక మందాన కన్నడ పరిశ్రమ నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది. ఆమె చర్యలను, కామెంట్స్ ని తప్పుబడుతున్న కన్నడ ఆడియన్స్ ట్రోల్ చేస్తున్నారు.కాగా కన్నడ పరిశ్రమ పెద్దలు, థియేటర్స్ యాజమాన్యాలు రష్మికను బ్యాన్ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కెరీర్ బిగినింగ్ నుండి రష్మికపై సొంత ఇండస్ట్రీలో వ్యతిరేకత ఉంది. ఆమె ఫస్ట్ మూవీ కిరాక్ పార్టీ కాగా రక్షిత్ శెట్టి హీరో. ఆయనతో రష్మిక ప్రేమలో పడ్డారు. పెళ్ళికి సిద్ధమైన రక్షిత్-రష్మిక ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు.

    పెళ్లి చేసుకుంటే కెరీర్ మటాషే అని నమ్మిన రష్మిక నిర్ణయం మార్చుకుంది. వివాహం రద్దు చేసుకుంది. అది రక్షిత్ అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. రష్మికను వారు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు. సోషల్ మీడియా వేధింపులకు గురి చేశారు. ఆ దెబ్బతో ఆమె ఇతర పరిశ్రమల్లో హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తారు. తెలుగులో రష్మికకు కలిసొచ్చింది. వరుస హిట్స్ పడటంతో స్టార్ హీరోయిన్ అయ్యింది.

    కన్నడిగులలో రష్మిక మీదున్న ఆవేశం మాత్రం తగ్గలేదు. ఇక ఒకటి రెండు సందర్భాల్లో రష్మిక కన్నడ పరిశ్రమ, ఆ భాష గురించి చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోశాయి. ఆమెపై ట్రోలింగ్ ఎక్కువైంది. కన్నడ పరిశ్రమ నుండి వచ్చిన కాంతార మూవీ చూడలేదని ఆమె చెప్పడం వివాదాస్పదమైంది. ఈ విషయంలో రిషబ్ శెట్టి, రష్మిక మధ్య మాటల యుద్ధం నడిచింది. కాగా రష్మికను బ్యాన్ చేస్తే కన్నడ పరిశ్రమే నష్టపోతుంనే వాదన వినిపిస్తోంది. ఆమెకు కొందరు మద్దతుగా నిలుస్తున్నారు.

    ఇదిలా ఉంటే రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రిలీజ్ ‘గుడ్ బై’ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో రష్మిక హాట్ ఫోటోస్ షేర్ చేశారు. ప్యాంటు లేకుండా జస్ట్ కోటు ధరించినట్లున్న ఆ డిజైన్ వేర్ లో రష్మిక సూపర్ గ్లామరస్ గా ఉన్నారు. ఈ డ్రెస్ పై కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఆమె వ్యతిరేక వర్గం. సినిమా టైటిల్ బాగుంది. నీకు అన్ని పరిశ్రమలు ‘గుడ్ బై’ చెబుతాయి, ఆ సినిమా మేము చూడం అంటూ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. రష్మిక తాజా ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది.