https://oktelugu.com/

Rashmi Gautam: ఆ బాధను ఆ ఫ్యామిలీ అనుభవించాలి.. రష్మీలో విప్లవం !

Rashmi Gautam: యాంకర్ రష్మీ గౌతమ్ కి కుక్కలు అంటే బాగా ఇష్టం. వాటి కోసం ఆమె నిత్యం కుక్కల వ్యతిరేక సమాజం పై, అలాగే కుక్కలను బాధించే వారి పై ఫైట్ చేస్తూ ఉంటుంది. అయితే, బెంగళూరులో ఓ అపార్ట్మెంట్‌లోని యువకుడు తన కారును నడుపుతూ పడుకున్న కుక్క మీద నుంచి తీసుకెళ్లాడు. దాంతో ఆ కుక్క మరణించినట్లు తెలిసింది. దీనిపై రష్మీ ఎమోషనలైంది. ‘డబ్బుతో వస్తువులను కొనొచ్చు. బుద్ధిని, పద్ధతిని కొనలేం. అ తన్ని […]

Written By: , Updated On : February 2, 2022 / 11:51 AM IST
Follow us on

Rashmi Gautam: యాంకర్ రష్మీ గౌతమ్ కి కుక్కలు అంటే బాగా ఇష్టం. వాటి కోసం ఆమె నిత్యం కుక్కల వ్యతిరేక సమాజం పై, అలాగే కుక్కలను బాధించే వారి పై ఫైట్ చేస్తూ ఉంటుంది. అయితే, బెంగళూరులో ఓ అపార్ట్మెంట్‌లోని యువకుడు తన కారును నడుపుతూ పడుకున్న కుక్క మీద నుంచి తీసుకెళ్లాడు. దాంతో ఆ కుక్క మరణించినట్లు తెలిసింది. దీనిపై రష్మీ ఎమోషనలైంది. ‘డబ్బుతో వస్తువులను కొనొచ్చు. బుద్ధిని, పద్ధతిని కొనలేం. అ తన్ని కఠినంగా శిక్షించారని తెలిసి సంతోషిస్తున్నాను. ఆ జీవి పడ్డ బాధను ఆ ఫ్యామిలీ అనుభవించాలి. కుక్కలను రాళ్లతో కొట్టడం సరదా అని పిల్లలకు నేర్పకండి’ అని తల్లిదండ్రులకు సూచించింది.

Rashmi Gautam

Rashmi Gautam

మొత్తానికి ఆ జీవి పడ్డ బాధను ఆ ఫ్యామిలీ అనుభవించాలి అని రష్మీ తనలోని విప్లవాత్మకమైన భావాలను వెలికితీసి కాస్త గట్టిగా వ్యక్తి పరిచింది. రష్మీ ఏమి చేసినా ఇలాగే వైల్డ్ గా చేస్తోంది. రష్మీ గౌతమ్ లో మొదటి నుంచి మూగజీవాలపై ప్రేమ ఎక్కువ. తన అందచందాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ హాట్ యాంకర్ లో ఈ వైవిధ్యాన్ని చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. మొత్తానికి రష్మీ గౌతమ్.. తనకు అందమైన శరీరంతో పాటు అందమైన మనసు కూడా ఉందని నిరూపిస్తోంది.

అయినా రష్మీ ఇదంతా పబ్లిసిటీ కోసం చేయడం లేదు. ఈ విషయంలో ఆమెను కచ్చితంగా మెచ్చుకోవాలి. ఆమెకు నిజంగానే మూగజీవాలంటే ఎనలేని ప్రేమ. ఎవరైనా వాటిని హింసిస్తే వెంటనే రియాక్ట్ అవుతూ సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ పనిలో పనిగా హెవీగా ఎమోషనల్ కూడా అవుతుంది. గత వారం కూడా ఆమె ఇలాగే బాగా సీరియస్ అవుతూ ఎమోషనల్ అయింది. ఢిల్లీ జూలో ఓ ఉద్యోగి జంతువును అకారణంగా కొడుతున్న వీడియో ఆమె కంటపడింది.

Also Read: విషాదం : తల్లిని కోల్పోయిన ఒకప్పటి అందాల తార !

వెంటనే దీనిపై సీరియస్ అయింది రష్మీ . ‘షేమ్ ఆన్ యూ ఢిల్లీ జూ స్టాఫ్’ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టింది. అలాగే ‘జూకి ఎవరూ వెళ్లకండి. అక్కడ వాటిని ఎంతలా హింసిస్తున్నారో చూడండి. ఈ వీడియో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చేరేలా ట్యాగ్ చేయండి’ అని కోరింది. మొత్తానికి ఆ వీడియో పై యాంకర్ రష్మీ సీరియస్ అవుతూ సీఎంకు కూడా ఫిర్యాదు చేసింది.

తాజాగా మళ్ళీ ఇలాంటి వార్తతోనే ఆమె మళ్ళీ వార్తల్లో నిలిచింది. మొత్తమ్మీద తాను మహా జంతు ప్రేమికురాలిని అని రష్మీ గౌతమ్ కాస్త గట్టిగానే ప్రూవ్ చేసుకుంటుంది. పైగా రష్మీ ఓ స్ట్రాంగ్ మెసేజ్ కూడా పాస్ చేసింది. ఎక్కడైనా సరే.. ఎప్పుడైనా సరే.. ఏ పెట్‌ కైనా సాయం కావాలంటే నేను వెంటనే రియాక్ట్ అవుతాను’ అంటూ రష్మీ పెన్ ఆఫర్ ఇచ్చింది.

Also Read: పవన్, బన్నీ, రవితేజ, ధనుష్.. ఆ పొరపాటు చేయకుండా ఉండాల్సింది !

Tags