https://oktelugu.com/

Sudigaali Sudheer: పూర్ణకు ముద్దు పెట్టబోయిన సుధీర్.. ఫీల్ అయిన రష్మీ.. రోజా వార్నింగ్..

Sudigaali Sudheer: జబర్ధస్త్.. బుల్లితెరపై ఎవర్ గ్రీన్ ఎంటర్ టైన్ మెంట్ షో. ఈ షో తెలుగు జనాలకు తెగ కామెడీ పంచుతుంది. ఎన్ని షోలు ఉన్నా ఎప్పటి నుంచో ఇది నంబర్ 1లో కొనసాగుతోంది. బిగ్ బాస్ వచ్చాక కాస్త జోరు తగ్గినా.. ఆ షో లేనప్పుడు మాత్రం జనాలు దీనికే అంకితమవుతున్నారు. జబర్ధస్త్ కమెడియన్లు , జడ్జీలు, యాంకర్లు చేసే సందడి అంతా ఇంతా కాదు.. తాజాగా జబర్ధస్త్ కు కొత్త జడ్జిగా వచ్చిన […]

Written By:
  • NARESH
  • , Updated On : April 23, 2022 / 09:18 AM IST
    Follow us on

    Sudigaali Sudheer: జబర్ధస్త్.. బుల్లితెరపై ఎవర్ గ్రీన్ ఎంటర్ టైన్ మెంట్ షో. ఈ షో తెలుగు జనాలకు తెగ కామెడీ పంచుతుంది. ఎన్ని షోలు ఉన్నా ఎప్పటి నుంచో ఇది నంబర్ 1లో కొనసాగుతోంది. బిగ్ బాస్ వచ్చాక కాస్త జోరు తగ్గినా.. ఆ షో లేనప్పుడు మాత్రం జనాలు దీనికే అంకితమవుతున్నారు.

    Sudigaali Sudheer

    జబర్ధస్త్ కమెడియన్లు , జడ్జీలు, యాంకర్లు చేసే సందడి అంతా ఇంతా కాదు.. తాజాగా జబర్ధస్త్ కు కొత్త జడ్జిగా వచ్చిన పూర్ణతో ఒక ఆసక్తికర సీన్ జరిగింది. కమెడియన్ సుధీర్, జడ్జి పూర్ణ మధ్య జరిగిన ఈ సీన్ ఇప్పుడు వైరల్ గా మారింది.

    Also Read: Sarubujjili Srikakulam District: ఆ ఊరికి దెయ్యం పట్టింది… గ్రామస్థులు బయటకు వెళ్లకుండా.. ఇతరులు గ్రామంలోకి రాకుండా రోడ్డు బ్లాక్

    సుధీర్ స్కిట్ పూర్తికాగానే నవ్వు ఆపుకోలేకపోయిన జడ్జి పూర్ణ అద్భుతంగా ఉందంటూ కొనియాడింది. అయితే బాగా ఉన్న స్కిట్ లు, షోల కంటెస్టెంట్లకు ముద్దులివ్వడం పూర్ణకు అలవాటు. ఢీ షోలో అలానే బాగా డ్యాన్స్ చేసిన వారి చెంపలు కొరికివేస్తుంది పూర్ణ.

    ఈ క్రమంలోనే తాము బాగా స్కిట్ చేశామని తమ బుగ్గ కూడా కొరకాలని సుధీర్, ఇమ్మాన్యూయెల్ లు జడ్జి పూర్ణను కోరుతారు. దానికి ఆమె తడబడుతూనే కాస్త మొహమాటంగా ఓకే చెబుతుంది. దీంతో తెగ ఉత్సాహంతో ఉరిముకుంటూ సుధీర్ ముద్దు పెట్టడానికి వస్తాడు.

    కానీ స్టేజ్ పైనే ఉన్న యాంకర్ రష్మీ మాత్రం.. మీరు సుధీర్ తో ముద్దు పెట్టించుకుంటే తాను ఫీల్ అవుతాను అంటూ తెగేసి చెబుతుంది. ఇక రోజానేమో కళ్లు మూసుకుంటాను అంటూ ఈ ఘోరం చూడనంటుంది.

    Sudigaali Sudheer

    ఇక ముద్దు పెట్టడానికి సుధీర్ రెడీ కాగానే రష్మీ మొఖం వాలిపోతుంది. ‘రష్మీ పెట్టాలా?’ అని పూర్ణ అడగడం.. ఆమె ముఖం ఎర్రగా కందిపోవడం ఈ సీన్ కే హైలెట్ గా మారింది. రష్మీ బాధ చూడలేక చివరకు రోజా వార్నింగ్ ఇస్తూ ‘సుధీర్ వెళ్లిపో’ అనడంతో ఆ సుధీర్-పూర్ణ ముద్దు మురిపాలకు చెక్ పడింది.

    ఇలా కాస్త అయితే సుధీర్ ఏకంగా జడ్జి పూర్ణకు ముద్దు పెట్టేసేవాడే. కానీ రోజా హెచ్చరికతో వీరి రోమాన్స్ కు చెక్ పడింది. కానీ ఈ ముద్దు కోసం సుధీర్ రాగానే యాంకర్ రష్మీ ముఖంలోని హావభావాలు చూస్తే మాత్రం ఆమె ఎంతగా ఫీల్ అయ్యిందో అందరికీ అర్థమైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    Also Read:Vaishnav Tej: ప్చ్.. విలన్ వేషాలు వేస్తున్న మెగా హీరో !

     

     

    Recommended Videos:

    Tags