Rashmi: బుల్లితెరపై హాట్ యాంకర్ రష్మీ. ఆమె అందం, చందం అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీపైనే కాదు.. సినిమాల్లోనూ హీరోయిన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రష్మీ అలరిస్తోంది. ఆమె అందచందాలు.. చేస్తున్న ప్రోమోలు యువత గుండెల్లో గిలిగింతలు పెట్టడం ఖాయం.

అలాంటి రష్మీ ఆ మధ్య ‘అసలేం గుర్తుకురాదు’ అనే పాటలో హాట్ హాట్ గా చీరలో ఆడిపాడి సెగలు పుట్టించింది. అదే పాటను జబర్ధస్త్ కమెడియన్, పొట్టివాడైన నరేశ్ తాజాగా పేరడి చేశాడు.
అచ్చం రష్మీలా సిగ్గులొలుకుతూ.. అదే హావభావాలతో నరేశ్ అదరగొట్టాడు. నరేశ్ యాక్టింగ్ చూసి జడ్జి కం ఎమ్మెల్యే రోజానే అతడి బుగ్గలు కొరికివేయాలని అనుకుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అయితే రష్మీని ఇమిటేట్ చేసిన నరేశ్ ను చూసి సిగ్గుతో రష్మీ చచ్చిపోయింది. నాకంటే ఎక్కువ సిగ్గుపడుతున్నావ్ అంటూ నరేశ్ ను గేలిచేసింది. నువ్వు సూపర్ అబ్బా అంటూ నరేశ్ ను కొనియాడింది. రష్మీలాగా నరేశ్ చేసిన ఇమిటేట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
అది మీరూ చూసి ఎంజాయ్ చేయండి..
