Rashi khanna- Vijay Devarakonda: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ, అతి కొద్దీ కాలం లోనే స్టార్ హీరోలకు పోటీ ఇచ్చే రేంజ్ కి ఎదిగిపోయాడు..శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే చిత్రం ద్వారా వెండితెర కి ఒక చిన్న పాత్ర ద్వారా పరిచయమైనా విజయ్ దేవరకొండ, ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రం లో సపోర్టింగ్ క్యారక్టర్ ద్వారా లైం లైట్ లోకి వచ్చాడు.

ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరో గా పరిచయమై తొలి సూపర్ హిట్ ని అందుకున్న విజయ్ దేవరకొండ,అర్జున్ రెడ్డి మరియు గీత గోవిందం వంటి సెన్సేషషల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో స్టార్ హీరోల రేస్ కి దూసుకొచ్చాడు..ఈ రెండు సినిమాల ద్వారా యూత్ లో ఆయనకీ మామూలు క్రేజ్ రాలేదు..ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా తరిగిపోని రేంజ్ స్టార్ స్టేటస్ ని సంపాదించాడు.
విజయ్ దేవరకొండ కి అంత తొందరగా ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి కారణాలలో ఆయన అందం కూడా ఒక్కటి..ఏం మంత్రం వేశాడో ఏమో తెలియదు కానీ..విజయ్ దేవరకొండ అంటే టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరుకు హీరోయిన్స్ పడి సచ్చిపోతున్నారు..తమన్నా , అనన్య పాండే , జాన్వీ కపూర్ ఇలా ఒక్కరా ఇద్దరా ఏ స్టార్ హీరోయిన్ ని అడిగిన విజయ్ దేవరకొండ తమ క్రష్ అని చెప్పుకుంటున్నారు..రీసెంట్ గా ఆ లిస్ట్ లోకి ప్రముఖ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా చేరిపోయింది..రీసెంట్ గా ఆమె ఆహా మీడియా లో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK 2’ టాక్ షో లో సీనియర్ హీరోయిన్స్ జయసుధ మరియు జయప్రద తో కలిసి ఒక గెస్ట్ గా పాల్గొన్నది.

ఈ టాక్ షో లో బాలయ్య బాబు ‘నీకు టాలీవుడ్ లో ఏ హీరో అంటే క్రష్ ఉంది అని అడుగుతాడు’..అప్పుడు రాశీ ఖన్నా సమాధానం చెప్తూ ‘నాకు విజయ్ దేవరకొండ అంటే క్రష్ ఉంది..అతను ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాను’ అంటూ కామెంట్ చేసింది..ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.