2022 Year Roundup: మన టాలీవుడ్ లో హీరోయిన్స్ కి కొదవే ఉండదు..తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన భామలకంటే ఉత్తరాది మరియు విదేశాల నుండి దిగుమతి అయినా భామలకే ఇక్కడి డైరెక్టర్స్ మరియు హీరోలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు..ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా కొత్త హీరోయిన్లు చాలా మంది ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు..వారిలో కొంతమంది అప్పటికే బాలీవుడ్ లో స్టార్స్ గా కొనసాగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు..అలా టాలీవుడ్ కి కొత్తగా పరిచయమైనా ఈ ముద్దుగుమ్మలు ఎవరెవరో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

1) సంయుక్త మీనన్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా ఈ మలయాళీ కుట్టి తెలుగు చలన చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యింది..అందం తో పాటు అభినయం తో కూడా ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టిన ఈమెకి టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి..భీమ్లా నాయక్ సినిమా తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన ‘భింబిసారా’ చిత్రం కూడా పెద్ద హిట్ అయ్యింది.
2)అలియా భట్ :
బాలీవుడ్ లో ఈమె ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అలియా భట్ అంటే నార్త్ ఇండియన్స్ పిచ్చెక్కిపోతారు..అందం తో పాటుగా అద్భుతమైన నటన అలియాభట్ సొంతం..ఈమె తెలుగు తెరకి #RRR చిత్రం ద్వారా పరిచయం అయ్యింది..ఈ చిత్రం లో ఆమె పోషించిన సీత పాత్ర కి మంచి రెస్పాన్స్ వచ్చింది..ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ – కొరటాల శివ చిత్రం లో నటించడానికి ముందు ఒప్పుకున్నా, ఆ తర్వాత ఎందుకో కొన్ని కారణాల వల్ల తప్పుకుంది..ఆమె రెండవ తెలుగు సినిమా ఎవరితో ఉండబోతుందో చూడాలి.
3)ఓలీవా మోరిస్ :
బ్రిటన్ దేశానికీ చెందిన ఈ బ్యూటీ కూడా #RRR చిత్రం ద్వారానే మన టాలీవుడ్ కి పరిచయం అయ్యింది..జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా నటించిన ఈమె అందానికి కుర్రాళ్లందరూ ఫ్లాట్ అయ్యారు..ఈ సినిమా తర్వాత ఆమె మళ్ళీ తెలుగులో సినిమాలు చేస్తుందో లేదో తెలియదు కానీ, ఒకవేళ చేస్తే మాత్రం అగ్ర హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచే ఛాన్స్ ఉంది
4) అనన్య పాండే :
ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అనన్య పాండే కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది..ఈమె తెలుగు ప్రేక్షకులకు పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ అనే సినిమా ద్వారా పరిచయం అయ్యింది..అందం ఉంది కానీ..నటన ఏ మాత్రం లేదనే విమర్శలు దక్కించుకుంది ఈ ద్వారా ఆమె..తొలి సినిమానే భారీ ఫ్లాప్ అవ్వడం తో ఇక ఈమెకి టాలీవుడ్ లో అవకాశాలు దక్కడం దాదాపుగా కష్టమే అని చెప్పొచ్చు.

5) సాయి మంజ్రేకర్:
ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె గా బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈమెకి కూడా మంచి యూత్ లో మంచి క్రేజ్ ఉంది..ఈమె తెలుగు ప్రేక్షకులకు ఈ ఏడాది వరుణ్ తేజ్ హీరో గా నటించిన ‘గని’ సినిమా ద్వారా పరిచయం అయ్యింది..తొలి సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ రెండవ సినిమా ‘మేజర్’ తో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది..అందం తో పాటుగా అభినయం లో కూడా పాస్ మార్కులు రప్పించుకున్న ఈమెకి భవిష్యత్తులో టాలీవుడ్ నుండి మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.
6) షిర్లే సేథియా :
నాగ శౌర్య హీరో గా నటించిన ‘కృష్ణ వృందా విహారి’ చిత్రం ద్వారా తెలుగు తెర కి హీరోయిన్ గా పరిచయమైనా షిర్లే సేథియా కి మొదటి సినిమాతోనే మామూలు క్రేజ్ దక్కలేదు..ఆ సినిమాలో పెద్దగా విషయం లేకపోయినా కూడా కేవలం ఈమెని చూడడానికే థియేటర్స్ కి కదిలారు జనాలు..ఫలితంగా సినిమా సూపర్ హిట్ అయ్యింది..రాబొయ్యే రోజుల్లో ఈమెకి క్రేజీ ఆఫర్స్ కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి
7) గెహెనా సిప్పి :
పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన ‘చోర్ బజార్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈమె కూడా తొలి సినిమాతోనే అందరిని ఆకర్షించింది..తొలి సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ ఆ తర్వాత సుడిగాలి సుధీర్ తో కలిసి నటించిన ‘గాలోడు’ చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది.
8) నజ్రియా :
ఈమె తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు..మలయాళం మరియు తమిళ బాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది..కానీ ఆమె తెలుగు లో మాత్రం నటించింది న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘అంటే సుందరానికి’ చిత్రం ఒక్కటే..ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.